Pawan Kalyan: హీరోయిన్ నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ ను ఎంతో పొగిడేసింది. రాజకీయ నాయకుడిగా, నటుడిగా ఆయనకు ఎంతో సత్తా ఉందని చెప్పింది. ఏదో ఒకసారి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతోంది.
హీరోయిన్ నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ పాల్గొంది. ఆమె రాజకీయ నాయకుడిగా, నటుడిగా పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ ఎన్నో ప్రశంసలు కురిపించింది. ముఖ్యంగా ఆయన రాజకీయ నాయకత్వంపై నిధి అగర్వాల్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. నిధి అగర్వాల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు మన దేశానికి ప్రధాన మంత్రి అయ్యే సామర్థ్యం ఉందని చెప్పింది. దీనితో పీకే అభిమానులంతా ఆనందంతో పొంగిపోతున్నారు.
24
ప్రధాన మంత్రి అయ్యే సత్తా
పాడ్‌కాస్ట్ లో మాట్లాడిన నిధి అగర్వాల్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ తన సిద్ధాంతాలను ఏమాత్రం వదలకుండా నిలబడ్డారని చెప్పుకొచ్చింది. ప్రజల కోసం పోరాడే తత్వం, తన అభిప్రాయాలను భయపడకుండా బయటికి చెప్పే ధైర్యం పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా నిలబడతాయని వివరించింది. ఇలాంటి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి దేశానికి పెద్ద స్థాయిలో సేవ చేసే సత్తా కలిగి ఉంటాడని, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ మరింత ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ముఖ్యంగా దేశానికి ప్రధానమంత్రి అయ్యే సత్తా ఆయనకుందని పరోక్షంగా చెప్పుకొచ్చింది.
34
ఎంతో నేర్చుకున్నా
నిధి అగర్వాల్.. పవన్ కళ్యాణ్ కలిసి హరిహర వీరమల్లు సినిమాలో కలిసిన నటించారు. షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఎంతో సింపుల్ గా ఉండే వారని, అందరినీ ఆత్మీయంగా పలకరించే వారని చెప్పింది. ప్రతి ఒక్కరినీ గౌరవించే లక్షణం ఆయనకు ఉందని, అదే తనకు నచ్చిందని తెలిపింది. ఆయనకు చాలా క్రమశిక్షణ ఎక్కువని, ఒక నాయకుడికి కావలసినది అదేనని వివరించింది. నటుడిగా మాత్రమే కాదు ఒక వ్యక్తిగా కూడా పవన్ కళ్యాణ్ నుంచి తన ఎన్నో విషయాలు నేర్చుకున్నట్టు నిధి అగర్వాల్ తెలిపింది.
నిధి అగర్వాల్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను తెగ పొగిడేస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ వీడియోలను షేర్ చేస్తూ థాంక్స్ చెబుతున్నారు. నిధి చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. రాజా సాబ్ లో కూడా నిధి నటించినప్పటికీ మంచి పేరు తెచ్చుకోలేకపోయింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వైరల్ గా మారింది నిధి.