హరిహర వీరమల్లు లేటెస్ట్ అప్డేట్, అన్నీ మెరుపు వేగంతో జరుగుతున్నాయి, అదే రోజున రిలీజ్ పక్కా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చివరి చిత్రం బ్రో 2023లో విడుదలైంది. ఈ చిత్రం తర్వాత పవన్ నుంచి రావాల్సిన చిత్రాలు వాయిదా పడుతూనే ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చివరి చిత్రం బ్రో 2023లో విడుదలైంది. ఈ చిత్రం తర్వాత పవన్ నుంచి రావాల్సిన చిత్రాలు వాయిదా పడుతూనే ఉన్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చివరి చిత్రం బ్రో 2023లో విడుదలైంది. ఈ చిత్రం తర్వాత పవన్ నుంచి రావాల్సిన చిత్రాలు వాయిదా పడుతూనే ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఓజి చిత్రాలని పూర్తి చేసే సమయం పవన్ కళ్యాణ్ కి దొరకడం లేదు. రాజకీయ కార్యక్రమాలతో పూర్తిగా బిజీ అయ్యారు.
అయితే హరిహర వీరమల్లు చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. అయితే మే 9న కూడా హరిహర వీరమల్లు రిలీజ్ కావడం అనుమానమే అని టాలీవుడ్ వర్గాల నుంచి ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పెండింగ్ షూటింగ్ ఇంకా 4 రోజులు ఉందట. దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంత వరకు వచ్చిందో తెలియదు. చాలా ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూనే ఉంది.
దీనితో మే 9న హరిహర వీరమల్లు విడుదల కావడం అనుమానమే అనే రూమర్స్ ఎక్కువయ్యాయి. దీనితో చిత్ర యూనిట్ రంగంలోకి దిగి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. రీ రికార్డింగ్, డబ్బింగ్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. మెరుపు వేగంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం. ఈ సమ్మర్ లో మీకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించబోతున్నాం.
హరిహర వీరమల్లు చిత్రం మే 9న ఎపిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు రిలీజ్ అవుతోంది అని ప్రకటించారు. దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే పెండింగ్ షూటింగ్ గురించి మాత్రం చిత్ర యూనిట్ నోరు మెదపలేదు. మరింత ఆలస్యం అయితే అమెజాన్ ప్రైమ్ తో ఉన్న ఓటీటీ డీల్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.