ఆసుపత్రిలోనే చిరంజీవి తల్లి.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందో చెప్పిన పవన్‌ కళ్యాణ్‌

Published : Jul 23, 2025, 05:59 AM IST

చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతుందనే రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. అవి తప్పు కాదట. నిజమే అని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. 

PREV
15
`హరి హర వీరమల్లు`ప్రమోషన్స్ లో బిజీగా పవన్‌ కళ్యాణ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం `హరి హర వీరమల్లు` సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం గురువారం(జులై 24)న విడుదల కానున్న నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ వరుసగా ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

 రెండు రోజులుగా ఆయన వరుసగా ప్రెస్‌ మీట్లు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్, అలాగే మీడియా ఇంటరాక్షన్స్ లో పాల్గొన్నారు. మంగళవారం మంగళగిరిలో పలు మీడియా సంస్థలతో ముచ్చటించారు. ఇందులో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

25
తల్లి అంజనాదేవి ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన పవన్‌

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన తల్లి అంజనాదేవి ఆసుపత్రిలోనే ఉన్నట్టు తెలిపారు. టీవీ9తో పవన్‌ ముచ్చటిస్తూ, గతంలో రెండు సార్లు కేబినేట్‌ మీటింగ్‌కి హాజరు కాలేదనే ప్రశ్నకి స్పందించారు.

 ఒకసారి తన ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల కేబినేట్‌ మీటింగ్‌ హాజరు కాలేకపోయానని, ఆ తర్వాత మరోసారి తన తల్లి ఆరోగ్యం బాగా లేదని, అందుకోసమే తాను  మీటింగ్‌లో పాల్గొనలేదని చెప్పారు పవన్‌.

35
ఆసుపత్రిలోనే అంజనాదేవి

మదర్‌ హెల్త్ విషయం కాబట్టి సెంటిమెంట్ గా వెళ్తుందని, అంతా ఏవేవో అనుకుంటారని ఆ విషయాలను బయటకు చెప్పలేదు, కానీ అమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మీటింగ్‌ హాజరు కాలేదన్నారు పవన్‌. 

ఈ సందర్భంగా మరో షాకింగ్‌ విషయం చెప్పారు. ప్రస్తుతం మదర్‌ ఆసుపత్రిలోనే ఉందని, ఇంకా ట్రీట్‌మెంట్‌ జరుగుతుందని, నెమ్మదిగా కోలుకుంటుందని తెలిపారు పవన్. 

ప్రస్తుతం ఆరోగ్యం బాగానే, నిలకడగానే ఉందన్నారు. ఈ వార్త ఇప్పుడు  మెగా అభిమానులను ఆందోళనకి గురి చేస్తుంది. అంజనాదేవికి ఏమైందని ఆరా తీస్తున్నారు.

45
గత నెలలో అంజనాదేవి అరోగ్యంపై వార్తలు

ఇదిలా ఉంటే గత నెలలో జూన్‌ 24న అంజనాదేవి అస్వస్థతకు గురైనట్టు, ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి. అపోలోలో ట్రీట్‌మెంట్‌ జరుగుతుందన్నారు. అదే సమయంలో మదర్‌ అనారోగ్యం నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌ కేబినేట్‌ మీటింగ్‌ కి అటెండ్‌ కాకుండా హుటాహుటిన హైదరాబాద్‌కి చేరుకున్నారనే వార్తలు వచ్చాయి. 

55
పవన్‌ కామెంట్‌తో మెగా అభిమానుల్లో ఆందోళన

 ఈ ఘటనపై అప్పుడు నాగబాబు స్పందించారు. అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది, ఒక తప్పుడు సమాచారం సర్య్కూలేట్‌ అవుతుందన్నారు. దీంతో ఈ వార్తలకు చెక్‌ పడ్డాయి. అయితే రెగ్యూలర్‌ చెకప్‌ కోసమే ఆసుపత్రికి వెళ్లారని మరో వార్త బయటకు వచ్చింది.

 ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై పవన్‌ కళ్యాణ్‌ క్లారిటీ ఇచ్చారు. అంజనాదేవి ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారని చెప్పడం ఆశ్చర్యపరుస్తోంది. మరి అంజనాదేవికి అనారోగ్య సమస్య ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories