ఈరోజు ఎపిసోడ్లో జగతి జరిగింది మొత్తం మహేంద్రకు చెబుతుంది. వసుధార ని నేను వాళ్ళ ఊరికి వెళ్లమని చెప్పాను మహేంద్ర అనడంతో వసుధార వెళితే ఎలా జగతి అని అనగా వెళ్లాలి మహేంద్ర వెళ్లి మళ్లీ తిరిగి ఈ ఇంటికి రావాలి. వాళ్ళిద్దరూ ఎప్పటికీ అధికారంగా కలిసి ఉండాలి అంటే వారిద్దరూ ఇంట్లోనే ఉండాలి అంటే మనం ఏం చేయాలో మొదట అది ఆలోచించు మహేంద్ర అని అంటుంది జగతి. వాళ్ళిద్దర్నీ మూడుముళ్ల బంధంతో ఒకటి చేయాలి అందుకు ఏం చేయాలో ఆలోచించు మహేంద్ర అని అంటుంది. మరుసటి రోజు ఉదయం కాలేజీలో మీటింగ్ అరేంజ్ చేస్తారు. అప్పుడు రిషి మాట్లాడుతూ ఈ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేయాల్సి వచ్చిందంటే మిషన్ ఎడ్యుకేషన్ మంచి ఫలితాలను ఇస్తుంది అని అందరూ అంటున్నారు.