సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్

First Published Apr 8, 2021, 4:45 PM IST

2000లో విడుదలైన బద్రి సంచలన విజయం అందుకుంది. పవన్ కళ్యాణ్ కి స్టార్డం తెచ్చిన సినిమాలలో అది ఒకటి. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రేణూ దేశాయ్ అప్పట్లో యూత్ కి తెగనచ్చేశారు.

సినీ పండితులు సైతం రేణూ దేశాయ్ సౌత్ ని ఏలేయడం ఖాయమని అంచనా వేశారు. బంగారం లాంటి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తున్నా, పవన్ ప్రేమ కోసం సినిమాను వదిలేసింది రేణూ దేశాయ్. అప్పటికే ఒప్పుకున్న ఓ తమిళ చిత్రం పూర్తి చేశాక, ఆమె ఇతర హీరోల సినిమాలు ఒప్పుకోలేదు.
undefined
2003లో వచ్చిన జానీ మూవీ తరువాత పూర్తిగా వెండితెరకు దూరం అయ్యారు. అయితే పవన్ నటించిన ఖుషి, అన్నవరం, బాలు, గుడుంబా శంకర్ వంటి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా,  ఖుషి, బాలు చిత్రాలకు ఎడిటర్ కూడా వర్క్ చేశారు.
undefined
పవన్ కోసం తెరవెనుకకు వెళ్లిన రేణూ దేశాయ్ 2012లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తరువాత పిల్లలు అకీరా, ఆద్యలతో ఆమె పూణే వెళ్లిపోవడం జరిగింది. ఇద్దరు పిల్లల తల్లిగా, వారి పోషణ, కుటుంబ భారం మోయడానికి తాము ఎంతో కష్టపడినట్లు రేణూ దేశాయ్ పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.
undefined
ఎప్పటికీ ఇక ముఖానికి మేకప్ వేసుకోదనుకున్న రేణూ దేశాయ్ గత ఏడాది తన కమ్ బ్యాక్ ప్రకటించారు. ఆమె నటిగా ఎటువంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధం అని ఓపెన్ గా, దర్శక నిర్మాతలకు తెలియజేశారు.
undefined
కెరీర్ కోసం పూణే నుండి హైదరాబాద్ కి మకాం మార్చిన రేణూ దేశాయ్... ఫుల్ బిజీగా మారారు. ప్రస్తుతం ఆమె ఓ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర చేస్తున్నారు.  అలాగే బుల్లితెర సీరియల్స్ తో పాటు, టీవీ కార్యక్రమాలలో నటిస్తున్నారు.
undefined
జీ తెలుగులో ప్రసారం కానున్న డ్రామా జూనియర్స్ నందు రేణూ జడ్జిగా వ్యవహరించనున్నారు.  గతంలో ఓ సినిమాకు దర్శకత్వం వచ్చిన రేణూ దేశాయ్, మరోమారు సోషల్ సబ్జెక్టుతో మూవీని తెరకెక్కించనున్నారట.
undefined
రైతుల సమస్యలను చర్చించేదిగా ఆ సినిమా ఉంటుందని, ఆమె తెలిపారు.  దాదాపు 17ఏళ్ల గ్యాప్ తరువాత ముఖానికి రంగు వేసుకున్న రేణూ దేశాయ్... కెరీర్ ఊపందుకున్నట్లు తెలుస్తుంది.
undefined
నటిగా, బుల్లితెర వ్యాఖ్యాత, జడ్జిగా పలు రోల్స్ లో ఆమె రాణించే సూచనలు కనిపిస్తున్నాయి.
undefined
click me!