అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ అంటేనే ఫాన్స్ కి ఒక పండగ..అది నిన్న రిలీజైన పుష్ప టీజర్ మరోసారి ప్రూవ్ చేసింది. టీజర్ చూస్తే ఎక్కడ తగ్గేదే లే...అనే రేంజ్ లో ఉంది..తెలుగు సినిమాలు అంటే నాలుగు పాటలు,,నాలుగు ఫైట్ లు ఒక ఐటెం సాంగ్ మాత్రమే అనే చులకన భావం నుండి తెలుగు సినిమా అంటే టెక్నికల్ వండర్స్,,కొత్త కధలు,,ఇండియా మొత్తం వసూళ్ల వర్షం కురిపించే సరికొత్త సినిమాలు ...ఇది ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పై ఉన్న అభిప్రాయం...బాహుబలి తో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న తెలుగు సినిమా మేకర్స్ మేకింగ్ పరంగా, కొత్త కథలతో క్వాలిటీ మూవీస్ తీస్తూ ఇండియా మొత్తం మన సినిమాల కోసం ఎదురు చూసేలా రాబోయే సినిమాల ని సిధ్దం చేస్తున్నారు..

పుష్ప టీజర్ విషయానికి వస్తే పుష్పరాజ్ క్యారెక్టర్ ని ఊర మాస్ గా డిజైన్ చేసారు దర్శకుడు. బన్నీ లుక్స్, బీజీఎమ్ అన్ని కూడా ప్రతి షాట్ ని ఎలివేట్ చేసేలా ఉన్నాయి. కళ్ళలో ఒకింత బెరుకు, తెగువ అన్ని కలగలిపి బన్నీ ఒక కొత్త అవతారంలో ఫ్యాన్స్ కి కనువిందు చేయనున్నాడు. సుకుమార్ ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేసాడు అంటే తీసుకునే కేర్ ఎలాంటిదో మనందరికీ తెలుసు. రామ్ చరణ్ పల్లెటూరి వ్యక్తిలా రంగస్థలం చేస్తున్నప్పుడు కూడా ఆ క్యారెక్టర్ కి చరణ్ సూట్ అవుతాడా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేసారు. కానీ తీరా సినిమా విడుదలయ్యాక ప్రజలు చిట్టిబాబును ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు బన్నీ కూడా అదే రగ్గుడ్ లుక్ తో రఫ్ క్యారక్టరైజేషన్ తో మనకు కనిపించనున్నాడు.

దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రిలీస్ అవుతున్న పుష్ప ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనే డిస్కషన్ ఇప్పుడు మొదలైంది..అల్లు అర్జున్ కి సౌత్ లో ఉన్న మార్కెట్ పరంగా చూస్తే ఈ బడ్జెట్ ఎక్కువ కాదు అనే చెప్పొచ్చు.. లాక్డౌన్ తర్వాత రిలీజ్ ఐన తెలుగు సినిమాలు ఆల్మోస్ట్ అన్ని వసూళ్ల పరంగా బానే ఉంటున్నాయి..ఉప్పెన,క్రాక్, జాతి రత్నాలు లాంటి సినిమాలైతే తెలుగులో వసూళ్ల వర్షం కురిపించాయి..ఏ మాత్రం హిట్ టాక్ వచ్చిన తెలుగు లో ఈ చిత్రం 250 కోట్లు వసూళ్ళని దాటొచ్చు..కానీ ఈ మూవీ టార్గెట్ తెలుగు లేదా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కాదు..హిందీ మార్కెట్..ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాస్ తప్ప అక్కడ స్టార్ అనిపించుకున్న తెలుగు హీరో ఎవరు లేరు...ఇప్పుడు మన హీరోలందరూ ఎలా ఐన పాన్ ఇండియా హీరో అవ్వాలని ప్రయత్నం లో ఉన్నారు..అందరి దృష్టి పాన్ ఇండియా మార్కెట్ పైనే ఉంది.

అల్లు అర్జున్ ఇప్పటివరకు డైరెక్ట్ హిందీ మూవీ చెయ్యలేదు... కొన్ని మూవీస్ హిందీ లో డబ్ చేసిన కూడా అవి టీవీ , యూట్యూబ్ వరకే..ఐతే ఆ సినిమా లు యూట్యూబ్ లో మాత్రం కొత్త రికార్డు లు క్రియేట్ చేసాయి..దీన్ని బట్టి అర్థం అవుతుంది మన సినిమాలు సరిగ్గా మార్కెట్ చేయగలిగితే అక్కడ వర్కౌట్ అవుతాయి..బాహుబలి సినిమా అయితే ఒక విజువల్ వండర్..ఆ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేయటం మనకు ఆశ్చర్యం కలిగించదు...కానీ యూట్యూబ్ వరకు చూస్తే మన మామూలు సరైనోడు లాంటి చిత్రాలు కూడా మిలియన్స్ హిట్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే ఆశ్చర్యం కలిగించక మానదు..అంటే మన సినిమాలు హిందీ బెల్ట్ లో నచ్చుతున్నాయి..ఎందుకు అంటే మన సినిమాల్లో ఉండే మాస్ ఎలెమెంట్స్ ఒక ఆన్సర్ కావొచ్చు.. ఈ స్థాయి లో చూసే వాళ్ళకి పూనకాలు తెప్పించే అంత మాస్ ఎలెమెంట్స్ హిందీ సినిమాల్లో ఉండవు.. వాటికి హిందీ బెల్ట్ లో ఉండే మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు కావొచ్చు....ఆ ధైర్యం తోనే పుష్ప లాంటి వూరమస్ మూవీ తో బన్నీ తన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా హిట్ విషయాన్నీ పక్కనుంచితే.... ఈ చిత్రం భారతీయ చిత్ర పరిశ్రమ గతిని కూడా మార్చనుంది.

బాహుబలి చిత్రం ముందు బాలీవుడ్ సినిమాలు తేలిపోయాయి. ఒక్క చిత్రంతోనే మనం ఇలాంటి నిర్ణయానికి రాకూడదు. కానీ... బాహుబలి, ఆ తరువాతి దాని సీక్వెల్, అర్జున్ రెడ్డి, జెర్సీ, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఇలా వరుస సినిమాలు కంటెంట్ పరంగా బలంగా ఉండి బాలీవడ్ చిత్ర పరిశ్రమను కుదిపేశాయి. ఒక్క సినిమా హిట్ అయితే లక్ అనుకోవచ్చు, కానీ ఈ మధ్య బలమైన కథాంశాలతో తెరకెక్కుతున్న చిత్రాలన్నీ హిట్ అవడం మాత్రం కాకతాళీయం కాదు. బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ గా నడుస్తున్న ఈ సంగ్రామంలో చివరి పేజీని పుష్ప లిఖించనుంది. సినిమా రిలీజ్ ఆగష్టు 13వ తేదీన జాన్ అబ్రహం చిత్రం ఎటాక్ కూడా విడుదలవనుంది. డైరెక్ట్ గా ఉండబోతున్న ఈ ఫేస్ ఆఫ్ లో పుష్ప తన ప్రతాపాన్ని చూపి భారతీయ ఫిలిం ఇండస్ట్రీ భవిష్యత్తును శాసించేది తెలుగు సినిమా ఇండస్ట్రీ అనే విషయాన్నీ తేటతెల్లం చేసేలా ఉంది.

కరోనా వల్ల బాలీవుడ్ మొత్తం పడకేస్తే.... మన టాలీవుడ్ లో మాత్రం క్రాక్ నుండి మొదలైన విజయ పరంపర ఇప్పుడప్పుడు ఆగేదిలా కనబడడం లేదు. మొత్తం దేశంలో మోస్ట్ పెర్ఫార్మింగ్ ఇండస్ట్రీ మన టాలీవుడ్ పరిశ్రమే. జాతిరత్నాలు వంటి చిన్న సినిమా సైతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇదొక కొత్త అధ్యాయానికి నాంది అని మాత్రం చెప్పవచ్చు.