ఏజెంట్ లాంఛింగ్ ఈవెంట్... అఖిల్ పై క్లాప్ కొట్టిన నాగ్!

First Published Apr 8, 2021, 1:46 PM IST

అక్కినేని యువ హీరో అఖిల్ నేడు కొత్త మూవీ ప్రారంభించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఏజెంట్ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. 

చాలా కాలం క్రితమే సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబినేషన్ లో మూవీ ప్రకటించడం జరిగింది.  ప్రీ ప్రొడక్షన్స్ జరుపుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ నేడు ప్రారంభమైంది.
undefined
ఏజెంట్ లాంఛింగ్ వేడుకకు కింగ్ నాగార్జున, అమల, సినీ రచయిత వక్కంతం వంశీ, హీరో అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి హాజరయ్యారు.  ఏజెంట్ చిత్రానికి నాగార్జున క్లాప్ కొట్టగా, అమల కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
undefined
హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ కార్యక్రమం జరిగింది.  అఖిల్ బర్త్ డే కానుకగా నేడు ఏజెంట్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఏజెంట్ గా అఖిల్ లుక్ చాలా రఫ్ అండ్ రా గా ఉంది. ఫస్ట్ లుక్ తోనే మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.
undefined
ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఏజెంట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.
undefined
ఇక ఏజెంట్ విడుదల తేదీ కూడా ప్రకటించడం విశేషం. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఏజెంట్ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది.
undefined
click me!