ఆ పాట వద్దనే వద్దు అంటూ చిత్ర యూనిట్ డిస్కషన్, చనిపోయిన అతడి సీన్లు కూడా..పవన్ కళ్యాణ్ ఏమన్నారో తెలుసా

First Published | Aug 18, 2024, 10:56 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో తమ్ముడు ఒకటి. కెరీర్ బిగినింగ్ లో పవన్ కి యూత్ లో ఫాలోయింగ్ పెంచిన చిత్రాల్లో తమ్ముడు కూడా ఉంటుంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో తమ్ముడు ఒకటి. కెరీర్ బిగినింగ్ లో పవన్ కి యూత్ లో ఫాలోయింగ్ పెంచిన చిత్రాల్లో తమ్ముడు కూడా ఉంటుంది. ఈ చిత్రంలో పవన్ తన మార్షల్ స్కిల్స్ ని బయట పెట్టారు. అంతే కాదు చాలా రియల్ స్టంట్స్ చేశారు. 

ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచిన అంశాల్లో ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ కూడా ఉంటుంది. ఈ సాంగ్ మొత్తం ఇంగ్లీష్ లో చేశారు. కానీ చిత్ర యూనిట్ ఎవరికీ ఈ పాట ఇంగ్లీష్ లో ఉండడం ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ తెలిపారు. 


ఇంగ్లీష్ లో సాంగ్ పెట్టడం కరెక్ట్ కాదు.. దీనిని తీసేసి తెలుగు పాట పెడదాం అని డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ తో పాటు అందరూ చర్చించుకున్నారట. పవన్ కళ్యాణ్ ని అడిగితే వద్ద ఇంగ్లీష్ లోనే ఉంచండి అని చెప్పారట. 

కానీ చిత్ర యూనిట్ ఎవరూ సంతృప్తి చెందలేదు. కళ్యాణ్ బాబుకి మరొక సారి చెబుదాం అని వెళ్లారు. దీనితో పవన్ కళ్యాణ్ తిట్టారట. ఈ సన్నివేశాలకి ఇంగ్లీష్ లోనే పాట బావుంటుంది. బయలుదేరు వీరుడా అని అంటుంటే కనీసం వినడానికి కూడా బాగోదు అని చెప్పారట. దీనితో పవన్ నిర్ణయాన్ని అంతా అంగీకరించక తప్పలేదు. 

అదే విధంగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సోదరుడిగా దివంగత నటుడు అచ్యుత్ నటించాడు. పవన్ అచ్యుత్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. అదే విధంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. అయితే అచ్యుత్ సీన్లు కొన్నింటిని ఎడిటింగ్ లో తొలగించాలని కూడా చిత్ర యూనిట్ అనుకున్నారట. అచ్యుత్ పిన్న వయసులోనే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. 

అచ్యుత్ సీన్లు తొలగించడానికి కూడా పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు అని మార్తాండ్ వెంకటేష్ తెలిపారు. ఆ సీన్లు తొలగించాలని అడిగితే.. ఏం మాట్లాడుతున్నారు.. ఒకసారి థియేటర్స్ లో చూడండి ఆ సీన్లు చాలా బావుంటాయి అని చెప్పారట. చివరికి పవన్ నిర్ణయమే కరెక్ట్ అయింది. ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ బాగా వర్కౌట్ అయింది. అదే విధంగా అచ్యుత్ సీన్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అని మార్తాండ్ వెంకటేష్ అన్నారు. తాము సినిమా రిలీజ్ కి ముందు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వర్కౌట్ అవుతాయి.. కొన్ని వర్కౌట్ కావు అని ఆయన అన్నారు. 

Latest Videos

click me!