బండ్ల గణేశ్ మాట్లాడుతూ ''నేను మొదట నుంచి కాంగ్రెస్ వాదిని. నా కంటే గొప్ప అభిమానులు, నాయకులు పవన్ కళ్యాణ్‌గారి వెంట ఉన్నారు. ఆంధ్ర ప్రాంతంలో జనసేన స్ట్రాంగ్‌గా ఉంది. తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడన్న బెంజికార్లు, ఆడికార్లు ఉన్నప్పుడు మారుతి 800 నడపమంటే ఎలా నడుపుతాం. వాస్తవాలు మాట్లాడుకుంటే తెలంగాణలో ఇతర పార్టీలకంటే జనసేన ప్రభావం తక్కువగానే ఉంది. అలాంటి పార్టీని భుజాన వేసుకుని మోయగలిగే శక్తి, సామర్థ్యం నాకు లేదు. పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి కావాలను కోరుకునే వాళ్లలో నేను ఒకడిని. ఆయనతో సినిమా చేశాను. ఇప్పుడు ఆయన్ని సినిమా చేయమని నేను అడగలేదు. ఆయన ఇస్తే తప్పకుండా సినిమా తీస్తాను. నాకు పది వ్యాపారాలున్నాయి. సినిమా ఒక్కటే వ్యాపారం కాదు'' అన్నారు.