కాసేపటికి బిగ్ బాస్ శక్తి చూపరా డింబకా టాస్క్ మొదలవుతుంది. అంతలోనే లోబో, యాంకర్ రవికి ఇంకా హౌస్ మేట్స్ మధ్యలో బట్టల గురించి చిన్న కామెడీ జరుగుతుంది. అయితే టాస్క్ విషయానికి వస్తే మొదట విశ్వ పవర్ రూమ్ అక్సెస్ పొందుతారు. పవర్ రూమ్ అక్సెస్ పొందిన తరువాత యాంకర్ రవి అలాగే ప్రియాకి సంబంధించిన బట్టలు, వస్తువులు స్టోర్ రూమ్ లో పెట్టడం జరుగుతుంది. రవి ధరించిన బట్టలతో విశ్వా డాన్స్ చేస్తూ అందరినీ అలరిస్తాడు.