Stars got Divorced: పవన్, మనోజ్, చైతు, ధనుష్, సుమంత్... విడాకులు తీసుకున్న స్టార్స్ వారసులు వీరే!

First Published Jan 18, 2022, 3:30 PM IST

పెళ్లి నూరేళ్ళ బంధం అంటారు. భారతీయ సంస్కృతిలో దీనికి విశిష్ట స్థానం ఉంది. శ్రీరాముని పూజించే నేలగా ఏక పత్నీవ్రతం ఆచారంగా ఉంది. బంధుమిత్రుల సమక్షంలో మూడు మూళ్ళ బంధంతో ఆడామగా ఒక్కటవుతారు. 
 

కాలంతో పాటు పెళ్లి బంధానికి ఉన్న విలువ పోతుంది. భార్యాభర్తల బంధం పలుచనైపోయింది. పాశ్చాత్య పోకడలు ఎక్కువై విడాకులు అనేవి కామనైపోయాయి.  చిన్న చిన్న కారణాలతో కూడా విడిపోయే జంటలు సొసైటీలో కోకొల్లలు. సర్దుకుపోయి బ్రతకడం అంటే నరకంలా ఫీల్ అవుతున్న మొగుళ్లు పెళ్ళాలు... పిల్లలు, పెద్దవాళ్ళు, సమాజం గురించి ఏమాత్రం ఆలోచించకుండా విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. సమాజంలో చట్టబద్దంగా విడిపోవడం నిత్యకృత్యం కాగా... వెండితెర స్టార్స్ గా సమాజంలో ఫేమ్ నేమ్ ఉన్న వాళ్ళు, వాళ్ళ వారసులు విడాకులు తీసుకొని విడిపోతున్నారు. హైక్లాస్ సొసైటీకి చెందిన ఈ కుటుంబాలలో ఈ సాంప్రదాయం మరింత ఎక్కువైంది. మరి పెళ్లి బంధానికి చట్టబద్ధంగా ముగింపు పలికిన స్టార్స్ వారసులు ఎవరో చూద్దాం.

రజనీకాంత్ (Rajinikanth)కేవలం బంధువుల అబ్బాయన్న ఒక్క కారణంతో తన పెద్ద కూతురు ఐశ్వర్యను ధనుష్ కి ఇచ్చి వివాహం చేశారు. 2004లో వీరి వివాహం ఘనంగా జరిగింది. జనవరి 17 అర్ధరాత్రి ధనుష్ (Dhanush) విడాకుల ప్రకటన చేసి షాక్ ఇచ్చారు. 18 ఏళ్ల వీరి వివాహ బంధంలో ఇద్దరు అబ్బాయిలు సంతానంగా జన్మించారు.


రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య కూడా మొదటి భర్తతో విడిపోయారు. 2010లో సౌందర్య పారిశ్రామికవేత్త అశ్విన్ రామ్ కుమార్ ని వివాహం చేసుకున్నారు. వీరు 2017లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2019లో సౌందర్య రెండో వివాహం చేసుకున్నారు. 


ఇక చాలా కాలంగా అక్కినేని కుటుంబాన్ని విడాకుల సెంటిమెంట్ వెంటాడుతుంది. నాగార్జున(Nagarjuna) తన మొదటి భార్య దగ్గుబాటి లక్ష్మీతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున మేనల్లుడు సుమంత్ కూడా విడాకులు తీసుకున్నారు. హీరోయిన్ కీర్తి రెడ్డిని 2004లో సుమంత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహమైన రెండేళ్లకే ఈ జంట విడిపోయారు. 


2017లో హీరోయిన్ సమంత(Samantha)ను నాగ చైతన్య (Naga Chaitanya)ఘనంగా వివాహం చేసుకున్నారు. గోవాలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో అంగరంగ వైభంగా వీరి వివాహం జరిగింది. 2021లో వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2021 అక్టోబర్ 2న అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు ప్రకటించారు. 
 

ఇక మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో కూడా పలుమార్లు విడాకులు చోటు చేసుకున్నాయి. చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)1997లో వైజాగ్ కి చెందిన నందిని అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరి వివాహ బంధంలో అనేక సమస్యలు తలెత్తాయి. గృహహింస, వరకట్నం వేధింపులు వంటి కేసులను చిరంజీవి ఫ్యామిలీ ఎదుర్కొన్నారు. 2008లో పవన్ కళ్యాణ్ కి ఆమెతో అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి.

2002లో బద్రి సినిమా షూటింగ్ సమయంలో పవన్ ఆ చిత్ర హీరోయిన్ రేణూ దేశాయ్ ని ప్రేమించారు. 2009లో అధికారికంగా వీరికి వివాహం జరిగింది. 2012లో రేణూ దేశాయ్ కి పవన్ విడాకులిచ్చాడు. వీరికి అకీరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పవన్ మూడో వివాహంగా తీన్ మార్ చిత్ర హీరోయిన్ అన్నా లెజినోవాను చేసుకున్నారు. ఆమెకు మరో ఇద్దరు సంతానం ఉన్నారు.

అలాగే చిరంజీవి (Chiranjeevi) చిన్న కుమార్తె శ్రీజ చదువుకునే రోజుల్లో తన క్లాస్ మేట్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల వైవాహిక జీవితం అనంతరం ఆమె విడాకులు తీసుకొని విడిపోయారు. 2016లో హీరో కళ్యాణ్ దేవ్ ని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనతో కూడా శ్రీజ(Sreeja)కు మనస్పర్థలు వచ్చాయని, విడిపోనున్నారని ఉహాగానాలు తెరపైకి వస్తున్నాయి.

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి సైతం భార్యతో విడాకులు తీసుకున్నారు. బాలీవుడ్ రైటర్ కనికా థిల్లాన్ ని ప్రేమ వివాహం చేసుకున్న ప్రకాష్ విడాకులు తీసుకొని విడిపోయారు.

కాగా మంచు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వైవాహిక జీవితంలో మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకొని విడిపోయారు. 
 

click me!