Nidhi Agarwal : ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపిన నిధి అగర్వాల్..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 18, 2022, 02:26 PM IST

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. యాక్టింగ్ తో పాటు బ్యూటీతో కూడా ఆకట్టకుంటోంది. ఇటీవల తను నటించిన ‘హీరో’ మూవీతో దూసుకుపోతోంది  ఈ భామ. అయితే హీరో మూవీని పాజిటివ్ టాక్ లో విజయవంతం చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది నిధి.  

PREV
16
Nidhi Agarwal : ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలిపిన నిధి అగర్వాల్..!

సూపర్‌ స్టార్‌ కృష్ణ  ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ అండ్ డైనమిక్  మరో  హీరో గల్లా అశోక్‌.  మాజీ మంత్రి  గల్లా  అరుణ మనవడు, ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు,  మహేష్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్‌. ఆయన హీరోగా  ఎంట్రీ  ఇచ్చిన  చిత్రం `హీరో`. 
 

26

యూత్‌లో భారీ క్రేజ్‌ ఉన్న నిధి అగర్వాల్‌ ఇందులో కథానాయికగా నటించి సినిమాపై క్రేజ్‌ పెరగడానికి మరో కారణం. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా  సంక్రాంతి  కానుకగా శనివారం(జనవరి 15) విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో మొత్తం హీరో టీం ఖుషీ అవుతుంది. 
 

36

ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ కూడా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. తను నటించిన సినిమా ‘హీరోను విజయవంతం చేసేందుకు  సహకరించిన, హిట్ టాక్ గా నిలిపిన ప్రేక్షకులకు నిధి మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో ధన్యవాదాలు తెలిపింది. 
 

46

‘అందరూ బాగున్నారని ఆశిస్తున్నా..  ఈ సంక్రాంతి గొప్ప అనుభూతిని కలిగించింది. అందుకు కారణం మా ‘హీట్’మూవీని ఆదరించి, హిట్ రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా చేయడమే’ అంటూ ట్వీట్ చేసింది. అందరకీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలిపింది.
 

56

కాగా, ఈ ట్వీట్ తో పాటు అభిమానుల కోసం నిధి ట్రెడిషనల్ లుక్ లో ఉన్న కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇప్పటికే నిధి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ అందిస్తున్న నిధి అగర్వాల్, మరోసారి తన ఫొటోలను పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. సూపర్ నిధి అంటూ కామెంట్లు పెడుతున్నారు. 
 

66

అయితే ఈ ఫొటోలో నిధి అగర్వాల్ చాలా బొద్దుగా, ముద్దుగా కనిపిస్తోంది. గోల్డ్ కలర్ టాప్ వేసుకుని, నెక్లెస్ ధరించింది నిధి. అప్పటికే సొగసుల నిధిని దాచుకున్న నిధి తన ఒంటిపై ఆభరణాలు ధరించడంతో మరింత అందంగా కనిపిస్తోందని పలువురు తెలుపుతున్నారు. త్వరలో నిధి తెలుగులో ‘హరి హర వీరమల్లు’, తమిళ్ లో ‘మగీజ్ తిరుమేని’ మూవీలో మెరియను న్నారు.  

click me!

Recommended Stories