తన నలుగురు పిల్లలతో పవన్.. క్యూట్ అండ్ రేర్ ఫోటోస్, తండ్రిని కమాండ్ చేయగలిగేది ఒక్కరు మాత్రమే..

Published : Sep 02, 2022, 11:59 AM IST

రేణుదేశాయ్ ద్వారా పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతానం. అకీరా నందన్, ఆధ్య ఇద్దరూ రేణు దేశాయ్ కి జన్మించిన పిల్లలు. మూడవ భార్యతో పవన్ కి మరో ఇద్దరు సంతానం కలిగారు. కుమార్తె పోలెనా, కుమారుడు మార్క్ శంకర్ మూడవ భార్యకి కల్గిన సంతానం.

PREV
111
తన నలుగురు పిల్లలతో పవన్.. క్యూట్ అండ్ రేర్ ఫోటోస్, తండ్రిని కమాండ్ చేయగలిగేది ఒక్కరు మాత్రమే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగలా ప్రారంభం అయ్యాయి. ఎక్కడ చూసినా అభిమానుల సందడి కనిపిస్తోంది. ప్రతి ఏడాది పవన్ అభిమానులు బర్త్ డే సెలెబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

211

పవన్ కళ్యాణ్ మూడు వివాహాలు చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి భార్య నందిని నుంచి.. రెండవ భార్య రేణు దేశాయ్ నుంచి విడిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన మూడవ సతీమణి అన్నా లెజినోవాతో జీవిస్తున్నారు. రేణుదేశాయ్ ద్వారా పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతానం. అకీరా నందన్, ఆధ్య ఇద్దరూ రేణు దేశాయ్ కి జన్మించిన పిల్లలు. 

311

మూడవ భార్యతో పవన్ కి మరో ఇద్దరు సంతానం కలిగారు. కుమార్తె పోలెనా, కుమారుడు మార్క్ శంకర్ మూడవ భార్యకి కల్గిన సంతానం. పవన్ కళ్యాణ్ తన పిల్లలతో ఎప్పుడు కనిపించినా ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. 

411

పవన్, రేణు దేశాయ్ వివాహానికి ముందే అకీరా జన్మించాడు. అకీరా అని ఫ్యాన్స్ అప్పుడే జూనియర్ పవర్ స్టార్ అని పిలవడం మొదలు పెట్టేశారు. అకిరా, ఆధ్య ఇద్దరూ పూణేలో రేణు దేశాయ్ వద్ద పెరిగారు. కానీ తరచుగా హైదరాబాద్ వస్తూ తండ్రితో గడుపుతుంటారు. మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ అన్నింటికీ అకిరా హాజరవుతుంటారు. 

511

అకిరాకి పవన్ కళ్యాణ్ తో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందని రేణు దేశాయ్ ఓ సందర్భంలో తెలిపింది. ఇక పవన్ కళ్యాణ్ గారిని కమాండ్ చేయగలివారు ఎవరైనా ఉన్నారు అంటే ఆద్య మాత్రమే అని రేణు దేశాయ్ తెలిపింది.  

611

తన పిల్లలకి సంబంధించిన బర్త్ డే వేడుకలు, స్కూల్ సెలెబ్రేషన్స్ కి పవన్ తప్పకుండా హాజరవుతుంటారు. ఇటీవల అకీరా స్కూల్ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కి పవన్, రేణు దేశాయ్ ఇద్దరూ హాజరయ్యారు. 

711

ఇక పవన్ రెండవ కుమారుడు మార్క్ శంకర్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారాడు. మార్క్ శంకర్ క్యూట్ లుక్స్ ఫాన్స్ తో పాటు నెటిజన్లని కూడా కట్టి పడేస్తున్నాయి. మెగా ఫ్యామిలీవేడుకల్లో అన్నా లెజినోవా తరచుగా మార్క్ తో కనిపిస్తూ ఉంటుంది. 

811

పవన్ కళ్యాణ్ తన రెండవ కుమార్తె పోలేనాని కూడా బాగా గారాబం చేస్తుంటాడట. పలు కార్యక్రమాల్లో పవన్ నలుగురు పిల్లలు కలసి కనిపిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తన పిల్లలతో ఉన్న క్యూట్ అండ్ రేర్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

911

అకిరా పుణేలో పెరిగినప్పటికీ తెలుగు బాగా మాట్లాడతాడట. కానీ ఆద్యకి తెలుగు రాదు. తెలుగు తప్పనిసరి అని రేణు దేశాయ్ అకిరాకి నేర్పించింది. ఆద్యా ఎక్కువగా మరాఠీలోనే మాట్లాడుతుందని అంటున్నారు. 

1011

ఇక అన్నా లెజినోవా రష్యాకి చెందిన మహిళ. తరచుగా పవన్, లెజినోవా పిల్లలతో కలసి రష్యాకి వెళుతున్నారు. మార్క్ శంకర్, పోలేనా రష్యన్ లాంగ్వేజ్ నేర్చేసుకుంటారేమో. 

1111

అకిరా నందన్ త్వరగా సినిమాల్లోకి రావాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం అకిరా మార్షల్ ఆర్ట్స్, మ్యూజిక్ లో శిక్షణ పొందుతున్నాడు. 

click me!

Recommended Stories