విజయ్ దేవరకొండపై త్రివిక్రమ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

First Published | Oct 28, 2024, 2:42 PM IST

విజయ్ దేవరకొండ నటనపై త్రివిక్రమ్ ప్రశంసలు కురిపించారు. తక్కువ సమయంలోనే విజయ్ ఎంతో ప్రేమ, ద్వేషం రెండింటినీ చూశాడని, అతను చాలా గట్టివాడని అన్నారు. సితార బ్యానర్ తో తన అనుబంధం గురించి విజయ్ దేవరకొండ మాట్లాడారు.

Trivikram, Vijay Devarakonda, VD12

  రౌడీ హీరో   విజయ్ దేవరకొండ యూత్ లో ఎలాంటి ఫాలోయింగ్  ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాకపోయినా, తగ్గేదేలే అన్నట్లు వరస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఓ సాలిడ్ హిట్ కోసం టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నాడు.

మరి గత సినిమా ఎఫెక్ట్ ఈ సినిమాపై భారీ హైప్ అయితే నెలకొంది. తాజాగా  దివాళి కానుకగా రిలీజ్ కి రానున్న “లక్కీ భాస్కర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు.   ఈ సినిమా ఈవెంట్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా హాజరయ్యారు.ఈ ఈవెంట్ లో విజయ్ పై త్రివిక్రమ్,త్రివిక్రమ్ పై విజయ్  చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
 

Trivikram, Vijay Devarakonda, VD12


విజయ్ దేవరకొండ స్టేజ్ మీద మాట్లాడుతూ.. సితార బ్యానర్‌తో తనకున్నఅనుబంధం చెప్పాడు. పెళ్లి చూపులు తరువాత మొదటి చెక్ సితార నుంచే వచ్చిందని అన్నాడు. త్రివిక్రమ్ ఆ చెక్ ఇచ్చాడని, ఆఫీస్‌కు పిలిచి తనతో మాట్లాడి.. పెద్ద హీరో అవుతావ్ అని  చెప్పారని అన్నారు.

త్రివిక్రమ్ తీసిన నువ్వే నువ్వే, నువ్వు నాకు నచ్చావ్.. జల్సా ఇలా అన్ని చిత్రాలు ఇష్టమని అన్నాడు. మరీ ముఖ్యంగా అతడు, ఖలేజా అంటే ప్రాణమని చెప్పుకొచ్చారు. అసలు ఖలేజా మూవీ బాగా లేదని ఎవరైనా అంటే వాళ్లతో గొడవలు పెట్టేసుకునేవాడని చెప్పుకొచ్చారు.


Trivikram, Vijay Devarakonda, VD12


 త్రివిక్రమ్ చేతులు మీద చెక్ తీసుకోవడం ఎంతో ఆనందంగా అనిపించిందట. త్రివిక్రమ్‌ను అప్పుడప్పుడు కలుస్తుంటాడట. కలిసిన ప్రతీ సారి రామాయణ, మహా భారతాల గురించి, సినిమాల గురించి, పర్సనల్ రిలేషన్స్ గురించి, ఫ్యామిలీ గురించి.. ఫిలాసఫీ గురించి ఇలా అన్ని విషయాల మీద చర్చిస్తుంటామని అన్నాడు. ఆయనతో టైం గడపడం చాలా బాగుంటుందని, ఎంత టైం అయినా తెలియదని అన్నాడు.

Trivikram, Vijay Devarakonda, VD12


 ఈ ఈవెంట్ లో విజయ్ పై త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. విజయ్ తనకి బాగా నచ్చిన నటుల్లో ఒకడు అని అలాగే చాలా తక్కువ టైం లోనే విజయ్ ఎంత ప్రేమని చూసాడో అంతకు మించిన ద్వేషాన్ని కూడా చేసేసాడు అని వ్యాఖ్యానించారు. త్రివిక్రమ్ మాటలకు విజయ్ ఎమోషనల్ అయ్యారు.

Vijay Devarakonda, VD 12, gowtham tinnanuri


త్రివిక్రమ్ మాట్లాడుతూ... “విజయ్ దేవరకొండ నా ఫేవరెట్ యాక్టర్. విజయ్ ఎంతో ప్రేమను చూశాడు. అదే సమయంలో అంతకు మించిన ద్వేషాన్ని కూడా చూశాడు. తక్కువ సమయంలో ఈ రెండింటిని చూసిన విజయ్ చాలా గట్టివాడు. అమృతం కురిసిన రాత్రి పుస్తకంలో దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ‘మావాడు మహా గట్టివాడు’ అనే కవితను మాటను రాశారు. “మావాడు కూడా చాలా గట్టి వాడు” అంటూ విజయ్ ని అభినందించారు. 
 

Vijay Devarakonda, VD 12, gowtham tinnanuri


ప్రస్తుతం విజయ్ దేవరకొండ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో VD12 అనే సినిమా చేస్తున్నారు. ఆయన కెరీర్ లో 12వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.  సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 

Latest Videos

click me!