పవర్ న స్టార్ పవన్ కళ్యాణ్ తన డూప్ ని కాపాడడం కోసం ప్రాణాలకు తెగించారు. ఆ సినిమా అద్భుత విజయం సాధించింది. అసలు ఇంతకీ ఆ సంఘటన ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి.
సాధారణంగా హీరోలు రిస్క్ తో కూడిన స్టంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు డూప్ లని, బాడీ డబుల్స్ ని ఉపయోగిస్తారు. కొందరు హీరోలు వీలైనంత వరకు రిస్క్ తో కూడిన సీన్లలో నటించే వారు ఉన్నారు. మరీ ఎక్కువ రిస్క్ ఉంటే మాత్రం డూప్ తప్పనిసరి. ఒక బ్లాక్ బస్టర్ మూవీ షూటింగ్ లో స్టార్ హీరోకి డూప్ గా నటించిన వ్యక్తి ప్రమాదంలో పడ్డాడు.
25
తొలిప్రేమ షూటింగ్ లో సంఘటన
దీనితో తన బాడీ డబుల్ కోసం ఆ స్టార్ హీరోనే రిస్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సంఘటన ఏంటో ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన బిగ్గెస్ట్ హిట్ మూవీ తొలిప్రేమ. ఈ చిత్రం నుంచే యువత పవన్ ని ఫాలో కావడం ప్రారంభించారు.
35
కరుణాకరన్ దర్శకత్వం
ఈ చిత్రం కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కింది. జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఈ మూవీ ఇంటర్వెల్ సన్నివేశంలో హీరో హీరోయిన్లు కారులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురవుతారు. వారు ప్రయాణిస్తున్న కారు కొండపై నుంచి పడిపోతుంది. ఈ సన్నివేశాన్ని కొడైకెనాల్ లో చిత్రీకరించారు.
కారు కొండపై నుంచి జారుతూ పడిపోయే సీన్ లో పవన్ కళ్యాణ్ కి బదులుగా డూప్ నటించారు. క్రేన్స్ సాయంతో కారుని కొండపై నుంచి పడేలా చేయాలి. క్రేన్ కి కట్టిన తాడు తెగిపోయింది అని కరుణాకరన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనితో కారు కంట్రోల్ తప్పి లోయ వైపు వెళుతోంది. మేము ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాం. ఇంతలో ఆరెంజ్ షర్ట్ వేసుకుని ఒక వ్యక్తి రోప్ సాయంతో వేగంగా కొండ దిగుతూ కారులో ఉన్న తన డూప్ ని కాపాడడానికి వెళుతున్నారు.
55
పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే
ఆరెంజ్ షర్ట్ వ్యక్తి ఎవరు అని చూస్తే హీరో గారు. మేమంతా షాక్ అయ్యాం. పవన్ కళ్యాణ్ గారు వేగంగా వెళ్లి ఆ వ్యక్తిని సేవ్ చేశారు. కరుణాకరన్ మాట్లాడుతూ..వివేకానంద చెప్పినట్లు మనం చేసే చిన్న చిన్న పనుల వల్లే మన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం బయటపడింది అని కరుణాకరన్ అన్నారు.