పవన్ కళ్యాణ్- అనుష్క శెట్టి: మిస్ అయిన బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే!

Published : Sep 01, 2025, 08:10 PM IST

Pawan Kalyan - Anushka Shetty: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్- లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కాంబో ఒక్క సినిమా కూడా రాలేదు. కాని వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మాత్రం మిస్ అయ్యాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటీ?

PREV
15
పవన్ కళ్యాణ్ అనుష్క కాంబో మిస్

Pawan Kalyan- Anushka: ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి జంట స్క్రీన్ పై కనిపిస్తే చాలు థియేటర్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. అలాగే, కొన్ని కాంబినేషన్లు స్క్రీన్ మీదకు కనిపిస్తే బాగుంటుందనీ, వారిని వెండి తెరపై చూడాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటారు. 

అలాంటి క్రేజీ కాంబినేషన్స్ తో సినిమా చేయాలని మూవీ మేకర్స్ భావించినా.. ఆ టైమ్ కు మిస్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి జంటలో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, అనుష్క శెట్టి ఉన్నారు. ఆశ్చర్యకరంగా వీరిద్దరూ ఒక్క సినిమాకైనా కలిసి పనిచేయలేదు. కానీ రెండు సూపర్ హిట్ సినిమాలను వీరు చేతులారా మిస్ చేసుకున్నారు. ఇంతకీ ఆ సినిమాలేంటీ?

25
బంగారం

వాస్తవానికి అనుష్క శెట్టి - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా రావల్సి ఉంది. కానీ, కొన్నికారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి అనుష్క శెట్టి తప్పుకోవల్సి వచ్చిందట. అనుష్క తప్పుకోవడంతో హీరోయిన్ ను మార్చేశారట. ఇంతకీ ఆ సినిమా ఏంటో కాదు. బంగారం. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బంగారం సినిమాకు ఓ ప్రత్యేక స్థానం. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, పవన్ స్టైల్, మాస్ యాటిట్యూడ్ మాత్రం ఫ్యాన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి.

35
ఆ సినిమా రిజెక్ట్ చేయడానికి కారణమదే..

ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట అనుష్క శెట్టినే తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే అనుష్కకు కేవలం ఒక్క క్లైమాక్స్ సీన్ మాత్రమే ఉండటం. అందులో పవన్ త్రిషను ట్రైన్ ఎక్కించేటప్పుడు చేయి అందించే షాట్. ఈ చిన్న రోల్ చేయడంలో ప్రయోజనం లేదని భావించిన అనుష్క, ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. దీంతో ఆ పాత్రను త్రిష పోషించింది. ఆ సమయంలో "అనుష్క కేవలం ఒక క్లైమాక్స్ సీన్ కోసం సినిమా రిజెక్ట్ చేసిందట" అన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ విషయం విని నిరాశ చెందారు.

45
విక్రమార్కుడు (2006)

రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన హిట్. రూ 11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. ఏకంగా రూ. 26 కోట్ల షేర్ సాధించింది. కానీ, ఈ సినిమాను మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ కోసం డిజైన్ చేశారని టాలీవుడ్ టాక్.

రాజమౌళి కథ రాస్తున్నప్పుడే హీరోగా పవన్, హీరోయిన్‌గా అనుష్కను ఫిక్స్ చేశాడు. కానీ, ఏదో కారణంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు రిజెక్ట్ చేశారు. ఫలితంగా ఈ ప్రాజెక్ట్ రవితేజ చేతికి వెళ్లి, ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

55
ఫ్యాన్స్ ఎప్పటికీ చూడలేని కాంబో

ఇలా ఒక సినిమా నుంచి అనుష్క తప్పుకోగా.. మరో సినిమాను పవన్ రిజెక్ట్ చేశారు. ఇలా ఈ స్టార్ జంట రెండు బ్లాక్‌బస్టర్స్ మిస్ అయ్యింది. ఇవి నిజంగా జరిగి ఉంటే, టాలీవుడ్‌లో పవన్–అనుష్క జంట ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించేదనే అనడంలో సందేహం లేదు. అసలు ఈ రెండు సినిమా పవన్–అనుష్క కాంబినేషన్‌లో వచ్చుంటే.. వేరే రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్ గా రికార్డులు క్రియేట్ చేసేవని సినీ విశ్లేషకులు ఇప్పటికీ అంటుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories