కళ్యాణ్ బాబు పేరు పవన్ కళ్యాణ్ అని ఎప్పుడు మారిందో తెలుసా.. అది పేరు కాదు బిరుదు

Published : Sep 01, 2025, 05:36 PM IST

పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలో పవన్ తన ఒరిజినల్ నేమ్ కళ్యాణ్ బాబు అనే పేరుతోనే నటించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గా ఎలా మారారు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం రోజు సెప్టెంబర్ 2న తన 54వ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకోనున్నారు. దీనితో ఒక రోజు ముందు నుంచే సోషల్ మీడియాలో సందడి మొదలైంది. అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి వరుస పోస్ట్ లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

25

పవన్ కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంలో పవన్ తన ఒరిజినల్ నేమ్ కళ్యాణ్ బాబు అనే పేరుతోనే నటించారు. ఈ మూవీ టైటిల్ కార్డ్స్ లో డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ 'ఇతడే మన కళ్యాణ్' అని వేశారు. అప్పటికి ఆయన పేరు పవన్ కళ్యాణ్ అని ఇంకా మారలేదు. కళ్యాణ్ బాబు అనే పేరు పవన్ కళ్యాణ్ గా మారింది 1997లో. గోకులంలో సీత మూవీ నుంచి పవన్ కళ్యాణ్ అనే పేరు ప్రారంభం అయింది. 

35

అసలు కళ్యాణ్ పేరు ముందు పవన్ అనేది రావడం వెనుక చిన్న సంఘటన ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు కరాటే, ఇతర మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. అయితే ముందుగా పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం ఉండేది కాదట. తన సోదరుడు నాగబాబు నెల్లూరులో కరాటే క్లాస్ కి వెళ్లేవారట. ఒకసారి నాగబాబు కరాటే నేర్చుకోమని పవన్ కి కూడా చెప్పారు. 

45

నాగబాబు ప్రోద్భలంతో పవన్ కరాటే నేర్చుకున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వ్యక్తిగా తాను మారడానికి ఎంతగానో ఉపయోగపడింది అని పవన్ ఓ సందర్భంలో తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వేరేవాళ్లని కొట్టేయడానికి కాదు.. నాలోని కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ బాగా ఉపయోగపడ్డాయి అని పవన్ తెలిపారు. 

55

1997లో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని హరిహర కళాభవన్ లో మార్షల్ ఆర్ట్స్ విద్యని అందరి ముందు ప్రదర్శించారు. పవన్ కళ్యాణ్ కరాటే స్కిల్స్ అక్కడ ఉన్న ఇషిన్ రే కరాటే అసోసియేషన్ వారిని బాగా ఆకట్టుకున్నాయి. దీనితో వారు కళ్యాణ్ కి 'పవన్' అనే బిరుదు ఇచ్చారు. పవన్ అంటే శక్తికి ప్రతీక. అందుకే ఆ బిరుదు ఇచ్చారు. ఆ విధంగా కళ్యాణ్ బాబు కాస్త పవన్ కళ్యాణ్ అన్నారు.  

Read more Photos on
click me!

Recommended Stories