సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెరిగేలా, గూస్ బంప్స్ తెప్పించేలా సుజీత్ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ ని ప్లాన్ చేశారట. రెండవ భాగాన్ని 2024లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర లాంచింగ్ జరగగా.. అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు లాంటి బడా నిర్మాతలు అతిథులుగా హాజరైన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చిత్రాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు కానీ వరుసగా ఓపెనింగ్స్ మాత్రం జరుగుతున్నాయి.