Intinti Gruhalakshmi: ప్రాపర్టీని అభి ప్రేమ్ కి ఇవ్వాలనుకున్న పరంధామయ్య.. కోపంతో రగిలిపోతున్న నందు?

First Published Feb 1, 2023, 8:53 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో పరంధామయ్య అందుకే నేను వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయాను. నా దగ్గర ఇంకా ఎంత సమయం ఉందో తెలియదు అనగా అప్పుడు తులసి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా ఆశ పెట్టుకున్నా వాళ్ళని బాధ పెట్టవచ్చు. మీకు శత్రువుని చేయవచ్చు అంటుంది తులసి. డబ్బు క్షణాల్లో బంధుత్వాలను తెంపేస్తుంది ఆ విషయం నాకు బాగా తెలుసు అంటాడు పరంధామయ్య. మావయ్య నాకు తెలిసి మీరు ఈ ఇంట్లో అందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగాను సహాయం చేశారు నాకు తెలిసి ఎవరికీ సహాయం చేయండి అంటే మీ మనవళ్లకే మనవరాలికి. మీకు కలిసి వచ్చిన ఈ ఆస్తిని వారి ముగ్గురు పేరు మీద రాస్తే వాళ్ళు మీ జ్ఞాపకంగా ఉంచుకుంటారు అనడంతో పనుందామయ్య సంతోషంగా సరే అని అంటాడు.
 

టెన్షన్ తిరిపోయింది కదా మామయ్య టాబ్లెట్ వేసుకుని ప్రశాంతంగా రెస్టు తీసుకోండి అనడంతో సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు పరంధామయ్య పేపర్ చదువుతూ ఉండగా ఇంతలో నందు లాస్య అక్కడికి వచ్చి ఆస్తి గురించి అడగడానికి టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి నాన్న ఇలా వచ్చావు రా కూర్చో నీతో ఒక విషయం మాట్లాడాలి అని అనగా అప్పుడు నందు ఆస్తి విషయం గురించి అని అనకు సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు సరే చెప్పు నందు ఏంటో అనగా నేను కాదు నాన్న ముందు మీరు చెప్పండి అని అంటాడు నందు. నేను కూడా ఒక శుభవార్తను మొదట నీకే చెప్తున్నాను ఇంట్లో ఇంకా ఎవరికి చెప్పలేదు అనడంతో లాస్య నందు ఇద్దరూ సంతోష పడుతూ ఉంటారు.
 

 అప్పుడు పరంధామయ్య నందు నీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. అప్పుడు నా అదృష్టము నీ అదృష్టమో తెలియదు కానీ మన కష్టాలు తీరడానికి ఆ దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడు. నాకు ఆలోచన తోచకపోయేసరికి తులసిని అడిగాను ఒక మంచి సలహా ఇచ్చింది అంటాడు పరంధామయ్య. ఆస్తిని మనవళ్ళకి,మనవరాళ్లకు ఇవ్వమని చెప్పింది అనడంతో నందు కోపంతో అక్కడి నుంచి పైకి లేస్తాడు. అది సరే నువ్వు ఏదో మాట్లాడాలి అనుకున్నావు కదా అని అది చెప్పు అనగా ఆస్తిని నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయండి నాన్న అంటాడు నందు. నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాను ఆ విషయంలో వెనక్కి తగ్గాలని లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పరంధామయ్య. అప్పుడు నందు, లాస్య ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు.
 

ఏంటి నందు ఇది ఇంట్లో అందరూ తులసి చెప్పింది చేస్తూ తులసి చెప్పిందే విన్నారు మనం మాట్లాడడానికి కూడా లేదు. ఎప్పుడూ మా నాన్న అంటావు కదా ఇప్పుడు ఏం జరిగిందో చూడు అనే నందు దెప్పి పొడుస్తూ ఉంటుంది లాస్య. అప్పుడు ఆ తులసి చెప్పింది వేదంగా భావిస్తూ ఆలోచనలను వెనక్కి తీసుకోరు అంటున్నాడు అనడంతో వెంటనే నందు తులసి తన గురించి ఆలోచిస్తే స్వార్థం అవుతుంది తను ఆలోచించింది పిల్లల గురించి మా పిల్లల గురించి,వాళ్ళ భవిష్యత్తు గురించి అని అంటాడు నందు. ప్రస్తుతం మనం సమస్యల్లో ఉన్నాం కాబట్టి తులసి ఇచ్చిన సలహా మనకు తప్పుగా అనిపిస్తుంది అని అంటాడు నందు. ఇప్పుడు తులసి మామయ్య ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు తులసి దగ్గరికి వెళ్లి పిల్లలను నీకు ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకోమని చెప్పు అని అనడంతో నందు ఆశ్చర్యపోతాడు.

తులసిని అడగడం తప్ప మనకు వేరే ఒక మార్గం లేదు నందు నేను చెప్పేది విను అని అంటుంది లాస్య. తులసి పని చేసుకుంటూ ఉండగా అంత అప్పుడు నందు ఎంతో కూల్ గా అక్కడికి వచ్చి నేను సహాయం చేద్దామని వచ్చాను అనడంతో ఎందుకు వచ్చారు అది చెప్పండి అంటుంది తులసి. నాన్నకు కలిసొచ్చిన విషయం గురించి మాట్లాడాను మన పిల్లలగా పేరు మీద రాయమని చెప్పావంట కదా అనగా నేను కేవలం సలహా మాత్రమే ఇచ్చాను అంటుంది తులసి. నేను చెప్పాల్సింది ఇంకా ఉంది అనడంతో ఏం చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పండి అంటుంది తులసి. అప్పుడు నందు నాకు ఇవ్వమని చెప్పు నాకు ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో బిజినెస్ పెట్టుకోడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటాడు నందు.
 

అవకాశం ఉంది కదా నువ్వు పిల్లలతో నాన్నతో మాట్లాడి ఆ ప్రాపర్టీని నాకు ఇవ్వమని చెప్పు తులసి అనడంతో తులసి ఆలోచనలో పడుతుంది. ఆ ప్రాపర్టీ నాకు ఇస్తే మూడేళ్లలో తిరిగి వాళ్ళకి చేస్తాను అనగా నేను మిమ్మల్ని ఏం చూసి నమ్మాలి అని అంటుంది తులసి. నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న పిల్లలు నన్ను అడిగితే నేను ఏమని చెప్పను. పిల్లలకు రాసి ఇవ్వమని చెప్పిందే నేను ఇప్పుడు వెళ్లి మీ నాన్నకు ఇవ్వండి అని చెబితే వాళ్ళు నా మాట నమ్ముతారా అంటుంది తులసి. పిల్లలు ఇప్పుడు చిన్నవాళ్లే కాదు పెళ్లయి సంసారాలు నడుపుతున్నారు మీరు మీ భార్య వినట్లే వాళ్ళు కూడా వారి భార్యలు మాట వింటారు అనగా నీ మాట వింటారు అనడంతో అది నాపై వాళ్లకు ఉన్న నమ్మకం ఉంటుంది తులసి.

వింటారని ఏదో ఒక విషయంలో కలగజేసుకొని చెప్పడం మంచిది కాదు కదా అంటుంది తులసి. అసలు మీరు నన్ను అడగాల్సిన పని ఏముంది పిల్లలపై నాకు ఎంత హక్కు ఉందో తండ్రిగా మీకు కూడా అంతే హక్కు ఉంది కదా మీరు వెళ్లి పిల్లలను డైరెక్ట్గా అడగండి నన్ను ఇలా మాట్లాడి ఇబ్బంది పెట్టకండి అంటుంది తులసి. అప్పుడు నందు ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా అప్పుడు పరంధామయ్య నాకు వచ్చిన ఆస్తిని దివ్యతో పాటు ప్రేమ్ అభి లపై రాస్తున్నాను అనడంతో వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు. అందరూ సంతోష పడుతుండగా నందు మాత్రం కోపంగా ఉంటాడు. సంపాదించుకోవడం చాలా కష్టం పోగొట్టుకోవడం ఈజీ ఆ విషయంలో మీ నాన్నను ఎగ్జామ్పుల్ గా తీసుకోండి అనడంతో వెంటనే లాస్య ఆయన కావాలనే పోగొట్టలేదు మామయ్య మీరు అలా మాట్లాడకండి అని అంటుంది.

అప్పుడు నందు అందరి ముందు నేను బిజినెస్ చేయడానికి చూస్తున్నాను కానీ పెట్టుబడి దొరక చాలా అవస్థలు పడుతున్నాను అది మీరందరూ చూస్తున్నారు కదా, నాకు ఈ సమయంలో మీ హెల్ప్ కావాలి మీ ప్రాపర్టీని నాకు ఇస్తే దాన్ని ఉపయోగించుకుని బిజినెస్ చేసుకుంటాను అంటాడు నందు. ఆ మాటలు విని అభి, ప్రేమ్ ఇద్దరూ షాక్ అవుతారు. అప్పుడు లాస్య నువ్వు అడిగితే పిల్లలు కాదంటారా అనగా ఏమంటావు అభి అని అనడంతో మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది కానీ నా అవసరాలు నాకు ఉంటాయి కదా డాడీ అని అంటాడు. అభి నువ్వు ఇలా మాట్లాడకు నేను నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అని నందు అంటాడు. అప్పుడు లాస్య అంకితం నువ్వు ఏమైనా అనుకుంటావేమో అని అభి అనుకుంటున్నాడు అనగా నేను అనుకోవడానికి ఏమీ లేదు ఆంటీ ప్రాపర్టీ ఇది విషయం నాకు సంబంధం లేదు అంటుంది అంకిత.

అప్పుడు ప్రేమ నాకు కూడా అవసరం ఉంది అనడంతో ఏంటి అంత అవసరమని లాస్య అనగా మొన్నటికి మొన్న శృతి ప్రెగ్నెన్సీ టెస్టులు చేయించడానికి కూడా లేకుండా నా శాలరీ మొత్తం లాక్కున్నావు అప్పుడు అమ్మ కొనిచ్చిన గిటార్ అమ్ముకోవాల్సి వచ్చింది అంటాడు ప్రేమ్. అప్పుడు ప్రేమ్ నేను మాత్రం ప్రాపర్టీ ఇవ్వదలుచుకోలేదు అని అంటాడు. అప్పుడు నందు అక్కడనుంచి తినకుండా లేచి వెళ్ళిపోతాడు. తర్వాత నందు జరిగిన విషయాలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు గులాబీ పూల మొక్కను గట్టిగా పట్టుకోవడంతో నందు చేతు నుంచి రక్తం రావడం చూసి తులసి షాక్ అవుతుంది.

click me!