ఇలాంటి పరిస్థితుల్లో 'రామాయణం' సినిమా కాజల్ కెరీర్‌కు కొత్త టర్నింగ్ పాయింట్ ఇస్తుందని అభిమానులు ఎక్స్ పెక్ట్ చేశారు. రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ మండోదరిగా కనిపించనుందనే వార్త బయటకు రాగానే చాలా ఆసక్తి నెలకొంది. కానీ ఫస్ట్ పార్ట్‌లో ఆమె క్యారెక్టర్‌కు వచ్చిన అవకాశం నిరాశపరిచిందని అంటున్నారు.
నివేదికల ప్రకారం, 'రామాయణం పార్ట్ 1'లో కాజల్ స్క్రీన్ టైమ్ 10 నిమిషాల కంటే తక్కువే. దీంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో మండోదరి పాత్రకు ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదనే ప్రశ్న ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది.
ఇప్పుడు అందరి ఫోకస్ 'రామాయణం పార్ట్ 2' పైనే ఉంది. కనీసం నెక్స్ట్ పార్ట్‌లోనైనా మండోదరి పాత్రకు ఎక్కువ ఛాన్స్ దక్కుతుందా అనే క్యూరియాసిటీ ఉంది. కాజల్ లాంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్ట్రెస్ టాలెంట్‌కు తగ్గ అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సినిమాల్లో స్టార్ హీరోయిన్ల పేరు వాడుకోవడమే కాకుండా, వారి నటనకు కూడా సరైన గుర్తింపు దక్కాలనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.