సిద్దు జొన్నలగడ్డకు అది అవమానమే, కానీ సిట్యువేషన్ అలాంటిది

First Published | Sep 24, 2024, 11:53 AM IST

తెలంగాణ యాసలో సిద్దు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. ఆ సినిమాను ఒక్కడే నడిపించాడు సిద్దు. 


ఇవాళంటే  స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ని తెలియని వాళ్లు లేరు. అయితే గుంటూరు కారం కు ముందు ఆ సిట్యువేషన్ లేదు. అప్పుడు అవి స్ట్రగులింగ్ డేస్.  డీజే టిల్లు సినిమాతో యూత్ ను ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో ఆ తర్వత  టిల్లు స్క్వేర్ సినిమాతో మరోసారి హిట్ కొట్టాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు చిన్న చిన్న పాత్రల్లో నటించిన సిద్దూ జొన్నలగడ్డ ఆతర్వాత హీరోగా మారి గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాద లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

 
 ఆతర్వాత 2022లో వచ్చిన డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ మూవీ అంటే మినిమం గ్యారెంటీ అనేలా చేసుకున్నాడు. అతని కెరీర్ డిజే టిల్లుకు ముందు డిజే టిల్లు తర్వాత అనేలా మారింది. ఈ మూవీ ఆడియన్స్ పై వేసిన ఇంపాక్ట్ చిన్నది కాదు. ప్రతి రోజూ ఏదో సందర్భంలో ఎవరో ఒకరు ఈ టిల్లు సినిమాలోని డైలాగ్స్ గురించి మాట్లాడకుండా ఉండలేరు. అదీ ఆ మూవీ ఇంపాక్ట్. 



తెలంగాణ యాసలో సిద్దు చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. ఆ సినిమాను ఒక్కడే నడిపించాడు సిద్దు. ఆ సినిమాకు కొనసాగింపుగా  టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకులకు నచ్చేసాడు.తనకు ఎంత క్రేజ్ వచ్చినా సరే ఆచి,తూచి అడుగులు వేస్తున్నాడు. సరైన ప్రాజెక్టుని ఎంపిక చేసుకునే ముందుకు వెల్లానుకుంటున్నాడు. ఈ సందర్బంగా చాలా కథలు విని వరస ప్రాజెక్టులు సైన్ చేస్తున్నాడు.
 

 
డిజే టిల్లు స్క్వేర్ కూడా సూపర్ హిట్ కావడంతో దూకుడు పెంచాడు సిద్ధు. వరుసగా మూవీస్ చేస్తున్నాడు. ఇందులో నీరజా కోన డైరెక్షన్ లో తెలుసు కదా అనే మూవీ ప్రత్యేకంగా కనిపిస్తోంది. అయితే ఈ మూవీ కంటే చాలా ముందే ఒక ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు సిద్ధు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రూపొందబోతోన్న ఈ మూవీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది.

చాలా సైలెంట్ గా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేస్తోంది టీమ్. ఇప్పటికే 80 శాతం వరకూ షూటింగ్ అయిపోయిందట. అయితే ఈ మూవీకి ‘ కొంచెం క్రాక్’అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ నేపధ్యంలో సిద్దు జొన్నలగడ్డ...గుంటూరు టాకీస్ కంటే ముందు జరిగిన ఎక్సపీరియన్స్ ఒకటి ఆ మధ్యన బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో చెప్పుకొచ్చారు. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. 


 సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ...నాకు ఓ సారి ఓ డైరక్టర్ ఫోన్ చేసారు. నేను మీతో సినిమా చేద్దామనుకుంటున్నాను. ఎప్పుడు ఇస్తారు టైమ్ కలవటానికి అన్నారు. టైమ్ ఏముంది అండీ ఇదే పని. మీరు ఎప్పుడంటే అప్పుడే. గుంటూరు టాకీస్ కంటే ముందు జరిగిన సంఘటన ఇది. అలా రెండు మూడు సార్లు కలుద్దాం అనుకున్నాం. కలవటం కుదరలేదు. కానీ అతను మాత్రం నాకు ఎక్కువ మర్యాద ఇచ్చి , నాతో చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు.

దాంతో ఓ రోజు నాకు నిజంగా డౌట్ వచ్చింది. మనం ఇప్పుడు ఉన్న పొజీషన్ లో ఎందుకింత మర్యాద ఇస్తున్నారు అని. మనం జీరో కదా మనమేం చెయ్యలేదు కదా అని. నేను ఆయనకు ఫోన్ చేసి, మీరు నన్ను ఏ సిద్దార్ద్ అనుకుంటున్నారు. బొమ్మరిల్లు సిద్దార్ద అనుకుంటున్నారా, నార్మల్ సిద్దార్ద అనుకుంటున్నారా అని. నేను బొమ్మరిల్లు సిద్దార్దే అనుకుంటున్నాడు అన్నాడు. నేను పోన్ పెట్టేసి ప్రక్కకు వెళ్లి ఛీ అనుకుని , ఇంకో గ్రీన్ టీ తాగమన్నాను అంటూ చెప్పుకొచ్చారు. 
 


మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సిద్దు జొన్నలగడ్డకు అవకాశం వచ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత దాని గురించి ఎక్కడా కూడా యూస్ లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సిద్దు మాట్లాడుతూ దీని పై స్పందించారు. మెగాస్టార్ తో సినిమా చేస్తే అది తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని అన్నాడు సిద్దు.

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

గతంలో చిరంజీవి గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. మళ్లీ ఆ అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నా.. మేము ఎప్పుడైనా కలిసిన దాని గురించే మాట్లాడుకుంటాం.. ఆయన ఓ సూపర్ హ్యూమన్. ఇండస్ట్రీ అంటే ముందు గుర్తుకొచ్చేది మెగాస్టారే అని అన్నాడు సిద్దు. అలాగే వెంకటేష్ తనకు ఆల్‌టైమ్ ఫేవరెట్‌ హీరో అని.. అలాగే నాకు చిరంజీవి, బాలకృష్ణ , అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ ఇలా అందరితో కలిసి నటించాలని ఉంది.

Latest Videos

click me!