బాలీవుడ్ నుంచి వలస వచ్చిన చాలామంది హీరోయిన్స్ తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికీ ఆ వలసలు కంటిన్యూ అవుతున్నాయి. అలా ఇక్కడికి వచ్చి తెలుగులో తనకంటూ ముద్ర వేసుకున్న సీనియర్ హీరోయిన్స్ లో రవీనా టాండాన్ ఒకరు. తెలుగులో ఆమె కొన్ని సినిమాలు చేసినప్పటికీ, బాలకృష్ణ సరసన చేసిన 'బంగారు బుల్లోడు' సినిమా ఆమెకి మంచి హిట్ ఇచ్చింది. ఆ తరువాత ఆమె వరుస హిందీ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.
ఈ మధ్య కాలంలో 'కేజీఎఫ్ 2' సినిమాలో రవీనా పోషించిన ప్రధానమంత్రి పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. రిమికా సేన్ అనే ఈ పవర్ఫుల్ పాత్రలో ఆమె గొప్పగా నటించింది. ఆ పాత్రలో నుంచి ఆమె ఎక్కడా బయటికి రాలేదు. ఈ మధ్య కాలంలో ఆమెకి దక్కిన మంచి పవర్ఫుల్ రోల్ ఇది. ఈ సినిమాలోని హైలైట్ ఎపిసోడ్స్ లో ఇది ఒకటి. ఈ సినిమా చూసిన చాలా మంది దర్శకులు ఆమెను తమ సినిమాల్లో అడుగుతన్నారు. తాజాగా ఆమెను సుధీర్ బాబు చిత్రంలో విలన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.
సుధీర్ బాబు (Sudheer Babu) పాన్- ఇండియా సినిమా చేయటానికి సిద్ధమవుతున్నారు. వెంకట్ కళ్యాణ్ (Venkat Kalyan) దర్శకత్వంలో శివన్ నారంగ్‌తో పాటు ప్రముఖ నిర్మాత ప్రేరణా అరోరా నిర్మిస్తున్న ఈ మూవీతో సూపర్ నేచురల్ ఫాంటసీ వరల్డ్‌లోకి సుధీర్ బాబు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీకి ‘జటాధర’ (Jatadhara) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
‘జటాధర’ ఇప్పటికే తెలుగు, బాలీవుడ్ రెండింటిలోనూ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్. రుస్తోమ్, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి లాంటి సూపర్ హిట్స్ అందించిన విజనరీ ప్రొడ్యూసర్ ప్రేరణా అరోరా నిర్మాణ భాగస్వామిగా వున్న ఈ ఎక్సయిటింగ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్రలో రవీనా టాండన్ కనిపించబోతోంది.
దర్శకుడు మాట్లాడుతూ... "నేను ఆమెకు కథ చెప్పగానే ఆవిడ పాత్ బ్రేకింగ్ రోల్ అవుతుందని , నెగిటివ్ షేడ్స్ ఉన్నా చేస్తానని అన్నారు. మా సూపర్ నాచురల్ థ్రిల్లర్ లో సుధీర్ బాబు, రవీనా టాండన్ మధ్యే కాంప్లిక్ట్స్ రన్ అవుతుంది. అదే కొత్త హై లోకి ప్రేక్షకులను తీసుకెళ్తుంది. ఆమె చాలా కొత్త పాత్రలో కనిపిస్తుంది ," అని చెప్పుకొచ్చారు.
ఈ చిత్రం షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని, టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేయనున్నారని మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ ‘జటాధర’ సినిమాను 2025 మహాశివరాత్రికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా అధికారికంగా ప్రకటించేశారు. ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
గతంలో హరీశ్ శంకర్, 'భవదీయుడు భగత్ సింగ్'లోని ఇక కీలకమైన పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్టుగా సమాచారం. రవీనా పాత్ర గురించి ఆమెకి చెప్పడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో చేస్తోందో లేదో కానీ సుధీర్ బాబు సినిమాతో రవీనా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయిందని చెబుతున్నారు. పవన్ కోసం అనుకున్న సినిమాలో ఆమెది కాలేజీలో ప్రిన్సిపాల్ పాత్ర అని తెలుస్తోంది.