మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన నభా నటేష్ నన్ను దోచుకుందువటే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నభా నటేశ్ మొదట మోడలింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించి, 2015లో కన్నడ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. అనంతరం తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. నభా నటేష్ కి హీరోయిన్ గా విజయాలు అంతగా లేవు. అయినప్పటికీ గ్లామర్ తో గుర్తింపు పొందింది.
27
నన్ను దోచుకుందువటే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ
సుదీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే చిత్రంతో నభా హీరోయిన్‌గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో తన సహజమైన నటనతో, అందమైన లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
37
నభా నటేష్ కెరీర్ లో ఏకైక బ్లాక్ బస్టర్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ నభాకు భారీ గుర్తింపు తీసుకొచ్చింది. "చాందిని" పాత్రలో ఆమె ఎనర్జీ, గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నభా నటేష్ కెరీర్ లో ఉన్న ఏకైక బ్లాక్ బస్టర్ మూవీ ఇదే.
ఆ తర్వాత నభా నటేష్ రవితేజ, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోలతో సినిమాలు చేసింది. ఆ చిత్రాలేమీ బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు.
57
డార్లింగ్ కూడా ఫ్లాప్
చివరగా నభా నటేష్ ప్రియదర్శికి జోడిగా డార్లింగ్ అనే మూవీ లో నటించింది. అది కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత నభా ఇంతవరకు తన కొత్త చిత్రానికి సైన్ చేయలేదు.
67
లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్
అవకాశాలు లేకపోవడంతో నభా నటేష్ ఖాళీగా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ యువతని ఆకర్షిస్తోంది. తాజాగా నభా నటేష్ వైట్ డ్రెస్ లో చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది.
77
8 సినిమాలు చేస్తే ఒక్కటి మాత్రమే హిట్
ఈ ఫోటో షూట్ లో నభా గ్లామర్ ప్రదర్శిస్తూ ఏంజిల్ లా మెరిసిపోతోంది. ఈ ఫోటో షూట్స్ తో అయినా నభా నటేష్ కి అవకాశాలు వస్తాయేమో చూడాలి. నభా నటేష్ తెలుగులో 8 చిత్రాల్లో నటించగా ఒక చిత్రం సూపర్ హిట్ , మరో మూవీ యావరేజ్ గా నిలిచింది. మిగిలినవన్నీ డిజాస్టర్ అయ్యాయి.