#Darshancase: తల్లి మర్డర్ కేసులో అరెస్ట్ పై పవిత్ర గౌడ్ కుమార్తె షాకింగ్ కామెంట్

First Published Jun 17, 2024, 1:20 PM IST

 ఈ వివాద  సమయంలో పవిత్ర కుమార్తె ఖుషీ మొదటి సారిగా సోషల్ మీడియా ద్వారా స్పందించింది. 

Pavithra Gowda


 కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీప(Darshan Thoogudeepa) అరెస్టు  సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. రేణుకాస్వామి (28) అనే యువకుడిని హత్య చేసిన ఆరోపణలపై దర్శన్‌, అతడి స్నేహితురాలు, నటి పవిత్రగౌడ (Pavithra Gowda) అరెస్టయ్యారు.  హత్య కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. పవిత్ర గౌడకు రేణుకా స్వామి అసభ్యకరమైన కామెంట్లు, సందేశాలు పంపినట్లు. దీంతో రేణుకాస్వామిపై దాడి చేసి హత్య చేశారు. 


ఇక దర్శన్ – పవిత్ర గౌడ గత 10 సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.  ఈ విషయాన్ని పవిత్ర గౌడ స్వయంగా సోషల్ మీడియాలో రాసుకున్నారు కూడా. 10 ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న పవిత్ర గౌడకు దర్శన్ ఎన్నో ఖరీదైన బహుమతులు ఇచ్చాడు.  ఈ వివాద  సమయంలో పవిత్ర కుమార్తె ఖుషీ మొదటి సారిగా సోషల్ మీడియా ద్వారా స్పందించింది. 


ఈ సంఘటన జరిగిన తర్వాత పవిత్ర కుమార్తె ఖుషీ తొలిసారిగా సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. ఫాదర్స్ డే సందర్భంగా ఆమె ఇనిస్ట్రగ్రామ్ ఎక్కౌంట్ లో ఆమె తన తల్లితో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది. ఆ ఫొటోలో పవిత్ర గౌడ...తన కుమార్తె ఖుషీ  నుదురుపై ముద్దు పెట్టుకుంటోంది. ఆ ఫొటోకు  క్యాప్షన్ గా హ్యాపీ ఫాదర్స్ డే....అన్ని నువ్వే అయిన అమ్మా అంటూ తన తల్లిని ట్యాగ్ చేసింది. ఆ కాప్షన్ ప్రక్కనే ఈవిల్ ఐ, పింక్ హార్ట్ ఎమోషన్ ని షేర్ చేసింది.  ఈ పోస్ట్ చూసిన వాళ్లంతా తల్లిని సపోర్ట్ చేస్తోందని , తండ్రి,అయినా తల్లైనా నువ్వేనని చెప్తోందని, ఓ రకంగా తల్లికి మోరల్ సపోర్ట్ ఇస్తోందని అంటున్నారు. 

పవిత్రగౌడ్ ఎవరూ అంటే ఆమె ఓ ఫ్యాషన్ డిజైనర్. అలాగే  ఓ నటి. అటు టీవీ ఇండస్ట్రీతో పాటు ఇటు సినిమాల్లోనూ నటించింది. 2016లో 54321 చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. ఛత్రిగాలు సార్‌ ఛత్రిగాలు, అగమ్య, ప్రీతి కితాబు వంటి వాటిల్లో కనిపించారు. తను ఒక మోడల్‌, ఆర్టిస్ట్‌ అని ఇన్‌స్టాగ్రాం బయోలో పేర్కొంది. రెడ్‌ కార్పెట్‌ స్టూడియో 777 పేరిట ఒక బొటిక్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అయితే కొద్దినెలల క్రితం ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో కలకలం సృష్టించింది. ‘‘మా బంధానికి పదేళ్లు’’ అంటూ దర్శన్‌తో ఉన్న ఫొటోలు పంచుకుంది.


 మార్చి నెలాఖరున పవిత్ర గౌడకు దర్శన్ వైట్ కలర్ రేంజ్ రోవర్ ఇచ్చాడని కన్నడ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పవిత్ర గౌడ పుట్టినరోజు 7, ఆమె బోటిక్ పేరు ‘రెడ్ కార్పెట్ స్టూడియో 777’. కాబట్టి పవిత్ర గౌడ తన కారుకు కూడా 0777 అనే ఫ్యాన్సీ నంబర్‌ని కొనుగోలు చేసింది. దర్శన్ బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో పవిత్ర గౌడకు దర్శన్ మూడు అంతస్తుల విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం పవిత్ర గౌడ & కుటుంబం అదే ఇంట్లో నివసిస్తున్నట్లు సమాచారం.
 

Darshan Pavithra Gowda Car


ఇక  దర్శన్‌ దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు.  దర్శన్‌ కొన్నేళ్లుగా పవిత్ర గౌడతో కలిసి ఉంటున్నారు. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని అశ్లీల సందేశాలు, దర్శన్‌ను విడిచిపెట్టాలని హెచ్చరికలు చేస్తూ వచ్చాడని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. 
 


అదే అతడి హత్యకు దారితీసిందని ఇప్పటివరకు వెల్లడైంది. హత్య అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు రూ.30 లక్షలు ఇస్తానని దర్శన్‌ తమకు ఆఫర్‌ ఇచ్చాడని ముగ్గురు నిందితులు నోరు విప్పారు. ఇదిలాఉంటే.. దర్శన్ హత్య కేసులో ఇరుక్కోవడంతో అతడి అభిమానులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం విచారణ నిమిత్తం అతడిని ఉంచిన పోలీసుస్టేషన్ వద్దకువచ్చిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. నేరానికి అనుగుణంగా పోలీసులే దీనిపై చర్యలు తీసుకుంటారని కర్ణాటక హోంశాఖ మంత్రి డాక్టర్‌ జి.పరమేశ్వర్‌ ఇప్పటికే స్పష్టంచేశారు. 
 


   ఇదిలా ఉంటే  దర్శన్ అభిమాని హత్య కేసులో ప్రధాన అనుమానితులలో ఒకరైన పవిత్ర గౌడ నటునికి స్నేహితురాలు మాత్రమేనని, అతని భార్య కాదని దర్శన్ న్యాయవాది అనిల్ బాబు స్పష్టం చేశారు. అనిల్ బాబు ఒక టివి చానెల్‌తో మాట్లాడుతూ, ‘దర్శన్ తూగుదీపకు పవిత్ర గౌడ రెండవ భార్యగాని, భాగస్వామి గాని కాదని నిర్దంద్వంగా ఖండించారు. విజయలక్ష్మి నటుడు చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్య అని, పవిత్ర గౌడ కేవలం సహ నటి, స్నేహితురాలు అని ఆయన చెప్పారు. 
 


దర్శన్‌కు రేణుకాస్వామితో ఏమాత్రం సంబంధం లేదని, హత్యలో ప్రమేయం లేదని కూడా అనిల్ బాబు స్పష్టం చేశారు. నేర స్థలం సమీపాన దర్శన్ కారులను చూపుతున్న సిసిటివి ఫుటేజ్ గురించి అనిల్ బాబు ప్రస్తావిస్తూ, నటుడు ఆ కారులో లేరని, అక్కడ అతను ఉన్నాడని నిరూపించే ఏ ఆధారాన్నీ పోలీసులు ఇవ్వలేదని అనిల్ బాబు చెప్పారు.
 

 పదేళ్ల క్రితం దర్శన్ పై దర్శన్  భార్య స్వయంగా గృహహింస కేసు పెట్టారు. అంతేకాదు, తనపై హత్యాయత్నం కూడా చేశారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో దర్శన్ అరెస్టయి, బెయిల్ పై విడుదలయ్యారు. గత ఏడాది తన పొరుగింటి మహిళపై పెంపుడు కుక్కలను ఉసిగొల్పారని దర్శన్ పై కేసు నమోదైంది. ఆ మధ్య దర్శన్ ఫామ్ హౌస్ లోంచి అటవీశాఖాధికారులు నాలుగు అడవి బాతులను స్వాధీనం చేసుకున్నారట. వన్యమృగ సంరక్షణ చట్టం ప్రకారం వీటిని నిర్బంధించి ఉంచడం నేరం. 
 


మైసూర్‌లో ఓ స్టార్ హోటల్లో వెయిటర్ పై దాడి చేసిన కేసులోనూ ఆయన నిందితుడు. ఇక దర్శన్ అండ్ కో చేతిలో కన్నుమూసిన రేణుకాస్వామి విషయానికొస్తే, అతను ఓ మందుల దుకాణంలో పనిచేసే సాదాసీదా వ్యక్తి. తాను ఎంతగానో అభిమానించే హీరో దర్శన్ కుటుంబంలో గొడవలు రేకెత్తిస్తోందనే ఆగ్రహంతోనే అతను పవిత్ర గౌడపై అశ్లీల పోస్టులతో ధ్వజమెత్తాడే తప్ప ఇందులో అతను వ్యక్తిగతంగా బావుకున్నదేమీ లేదు. 

Latest Videos

click me!