పరోక్షంగా ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిన మూవీ అదేనా.. కేరవ్యాన్ లో వెక్కి వెక్కి ఏడుస్తూ, ఆ అవమానంతో మరింతగా

First Published Jun 17, 2024, 12:26 PM IST

అయితే ఆర్తి అగర్వాల్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు కూడా బరువు సమస్య ఎదుర్కొంది. కానీ అప్పుడది ఆమెకి అంతగా ఇబ్బంది కాలేదు. ఆ తర్వాత నెమ్మదిగా వెయిట్ పెరుగుతూ వచ్చింది.

తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని అందాల నటి ఆర్తి అగర్వాల్. చూడచకనైన రూపంతో యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆర్తి అగర్వాల్ ఎంతగానో అలరించింది. అవసరం అయితే గ్లామర్ గా.. అదే విధంగా ట్రెడిషనల్ గా అందంగా కనిపించగల అతి కొద్దిమంది హీరోయిన్లలో ఆర్తి అగర్వాల్ ఒకరు. నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ లాంటి హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ కెరీర్ నెమ్మదిస్తూ వచ్చింది. ఇంతలో ఆర్తి అగర్వాల్ జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. 

 ముఖ్యంగా అంతా చర్చించుకునే సంఘటన హీరో తరుణ్ తో లవ్ ఎఫైర్ రూమర్స్. ప్రేమ విఫలం కావడంతో ఆర్తి అగర్వాల్ చాలా బాధపడినట్లు వార్తలు వచ్చాయి. ఆసుపత్రి పాలైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కూడా ఆర్తి అగర్వాల్ సినిమాల్లో నటించింది. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆర్తి అగర్వాల్ 2015లో 31 ఏళ్ళ అతి పిన్న వయసులో మరణించింది. అయితే ఆమె మరణానికి కారణం ప్రేమ వ్యవహారం కాదని చాలా మంది చెబుతారు. బరువు తగ్గేందుకు ఆమె తీసుకున్న ట్రీట్మెంట్ వికటించడం వల్ల మరణం సంభవించినట్లు ప్రచారంలో ఉంది. 

అయితే ఆర్తి అగర్వాల్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు కూడా బరువు సమస్య ఎదుర్కొంది. కానీ అప్పుడది ఆమెకి అంతగా ఇబ్బంది కాలేదు. ఆ తర్వాత నెమ్మదిగా వెయిట్ పెరుగుతూ వచ్చింది. ఆమె చివరగా నటించిన చిత్రం అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రణం 2. ఆయా చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనని పూస గుచ్చినట్లు అమ్మరాజశేఖర్ వివరించారు. ఈ చిత్రానికి ఆర్తి అగర్వాల్ సైన్ చేసే సమయంలో అంతగా బరువు లేదు. అందంగానే ఉంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఆరు నెలల తర్వాత ఆలస్యంగా రెండవ షెడ్యూల్ మొదలైంది. 

అప్పుడు ఆమె విపరీతంగా బరువు పెరిగిపోయింది. షాట్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ఆర్తి అగర్వాల్ కేరవ్యాన్ లో రెడీ అవుతోంది. ఎంత సేపటికి కేరవ్యాన్ నుంచి ఆమె బయటకి రాలేదు. అసిస్టెంట్స్ ని అడిగితే కాస్ట్యూమ్ సెట్ కావడం లేదు సర్ అని చెప్పారు. లాస్ట్ షెడ్యూల్ లో వాడిన కాస్ట్యూమ్ కదా ఎందుకు సెట్ కావడం లేదు అని అడిగాను అని అమ్మ రాజశేఖర్ తెలిపారు. ఆలస్యం అవుతుండడంతో సెట్ లో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను వెళ్లి మాట్లాడతా అని కేర వ్యాన్ లోకి వెళ్ళా. ఆర్తి అగర్వాల్ నటించిన చాలా చిత్రాలకు నేను డ్యాన్స్ కంపోజ్ చేశా. కాబట్టి ఆమె నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటిదే. 

తన పర్సనల్ విషయాలని, లవ్ ప్రాబ్లెమ్స్ ని కూడా నాకు చెప్పుకునేది. ఆమెతో అంత మంచి రిలేషన్ ఉంది.ఆమె తన జీవితంలో, ప్రేమ విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు పడిందో అందరికి తెలుసు అని అమ్మ రాజశేఖర్ అన్నారు. కాబట్టి సమస్య ఉంటే నాకు చెబుతుందని కేరవ్యాన్ లోకి వెళ్ళా. వెళ్లి చూస్తే వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగితే.. బాగా బరువు పెరిగాను సర్.. డ్రెస్ సెట్ కావడం లేదు. 

ఇదే కాస్ట్యూమ్ తో వస్తే చాలా వల్గర్ గా కనిపిస్తాను అని ఏడ్చేసింది. సరే టెన్షన్ పడకు.. ఈ రోజు షూటింగ్ ఎలాగోలా పూర్తి చెయ్. నెక్స్ట్ షెడ్యూల్ రెండు మూడు నెలల తర్వాత పెడతా. నిర్మాతలకు నేను ఏదో ఒకటి చెప్పుకుంటా.. ఈ లోపు నువ్వు కాస్త బరువు తగ్గు అని చెప్పా. దీనితో ఆర్తి అగర్వాల్ చాలా సంతోషంతో థ్యాంక్స్ మాస్టర్ అని ఎగిరి గంతులేసింది. 

తర్వాతి షెడ్యూల్ కి పిలిస్తే మాస్టర్ ఇంకొక్క నెల మాస్టర్ అని రిక్వస్ట్ చేసింది. నేను కూడా ఆ చిత్రంలో నటిస్తున్నా. నాకు కూడా గడ్డం, బాడీ మెంటైన్ చేయడం కష్టంగా అనిపించింది. కానీ ఏం చేయగలం అని అమ్మరాజశేఖర్ అన్నారు. ఇంతలో బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆర్తి అగర్వాల్ ఇక లేరు అని చెప్పారు. ఈ చిత్రం కోసం బరువు తగ్గే క్రమంలో ఆర్తి అగర్వాల్ ట్రీట్మెంట్ తీసుకుని ఆరోగ్య సమస్యలు తెచ్చుకుందని.. దానివల్ల మరణించినట్లు చెప్పుకుంటారు. 

అయితే అమ్మ రాజశేఖర్ దగ్గర ఆర్తి అగర్వాల్ తన కష్టాలు, అవమానాలు చెప్పుకుంది. చూడండి మాస్టర్ నేను ఎంత పెద్ద బ్యానర్స్ లో హిట్ సినిమాలు చేసానో మీకు తెలుసు. కానీ ఇప్పుడు నాకు ఎవ్వరూ రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. హీరోయిన్ గా తీసుకోవడం లేదు అని బాధపడిందట. నువ్వేం బాధపడకు.. చిత్ర పరిశ్రమలో ఇలాగే ఉంటుంది. నువ్వు బరువు తగ్గి రా.. నిన్ను హీరోయిన్ గా పెట్టి నేను సినిమాలు చేస్తా అని మాట ఇచ్చారట. అంతలోనే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. 

Latest Videos

click me!