పటౌడీ ఫ్యామిలీ ఆదివారం ఈస్టర్ పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ పార్టీకి కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాజరయ్యారు. కరీనా కపూర్ నుంచి కరిష్మా కపూర్ వరకు సందడి చేశారు. ఈ ఫోటోలను సోహా అలీ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పటౌడీ, కపూర్ కుటుంబాలు కలిసి ఆదివారం ఎంజాయ్ చేశాయి. ఈస్టర్ సందర్భంగా అందరూ కలిసి లంచ్ చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఎన్నో ఫోటోలను సోహా, సారా అలీ ఖాన్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
26
పసుపు రంగు డ్రెస్‌లో సారా
ఈస్టర్ సెలబ్రేషన్స్‌లో సారా అలీ ఖాన్ తన అత్త సోహా, తండ్రి సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. పసుపు రంగు డ్రెస్‌లో సారా చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటోలో కునాల్ ఖేము, జహాన్ కపూర్ కూడా ఉన్నారు.
36
స్పెషల్ అట్రాక్షన్
కపూర్, పటౌడీ ఫ్యామిలీలు ఆదివారం కలిసి ఎంజాయ్ చేశాయి. ఈ పార్టీలో కరీనా కపూర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె కరిష్మా, సారాతో కలిసి పోజులిచ్చింది. మరోవైపు సోహా అలీ ఖాన్ తన తల్లి షర్మిలా ఠాగూర్‌తో కనిపించారు.
సైఫ్, సారా, ఇబ్రహీం అలీ ఖాన్ అందరితో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఈ పార్టీలో సోహా అలీ ఖాన్ అందరికంటే ఎక్కువ సందడి చేస్తూ కనిపించారు. కునాల్ ఖేము, సబా అలీ ఖాన్ కూడా సంతోషంగా కనిపించారు.
56
ఇబ్రహీం, సారా తమ నానమ్మ షర్మిలా ఠాగూర్‌తో..
ఈస్టర్ వేడుకల్లో తైమూర్, జెహ్, ఇనాయా కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. మరోవైపు, ఇబ్రహీం, సారా తమ నానమ్మ షర్మిలా ఠాగూర్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు.
66
గ్రూప్ ఫోటో
ఆదివారం నాడు కపూర్, పటౌడీ కుటుంబాలు ఒకేచోట సందడి చేశాయి. ఈ సందర్భంగా ఇబ్రహీం, సారా.. కరీనా, సైఫ్, సోహా, సబాలతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.