ఫైమాకి నచ్చలేదు.. జబర్దస్త్ లేడీ కమెడియన్‌తో బ్రేకప్‌పై `పటాస్‌` ప్రవీణ్‌ క్లారిటీ.. మళ్లీ కలిసినట్టేనా?

Published : Jan 14, 2024, 09:36 PM ISTUpdated : Jan 15, 2024, 09:24 AM IST

`జబర్దస్త్` షో ద్వారా పాపులర్‌  అయిన ఫైమా, `పటాస్‌` ప్రవీణ్‌ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల విడిపోయినట్టు వార్తలొచ్చాయి. తాజాగా ఈ ఇద్దరు కలిశారు. కానీ..  

PREV
16
ఫైమాకి నచ్చలేదు..  జబర్దస్త్ లేడీ కమెడియన్‌తో బ్రేకప్‌పై  `పటాస్‌` ప్రవీణ్‌ క్లారిటీ.. మళ్లీ కలిసినట్టేనా?

`జబర్దస్త్` కామెడీ షో చాలా మందిని స్టార్లని చేసింది. కామెడీ ఆర్టిస్ట్ లుగా సినిమాల్లో రాణిస్తున్నారు. ఇతర షోస్‌ చేస్తున్నారు. కొందరు రైటర్స్ గా, మరికొందరు దర్శకులుగా సెటిల్‌ అయ్యారు. తమ సత్తాని చాటుతున్నారు. ఇంకోవైపు హీరోగా మెప్పిస్తున్నారు. మొత్తంగా జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. అందులో జబర్దస్త్ ఫైమా, `పటాస్‌` ప్రవీణ్‌ కూడా ఉన్నారు. 
 

26

అయితే జబర్దస్త్ షో ప్రేమ జంటలను కూడా తయారు చేస్తుంది. యాంకర్‌ రష్మి, సుడిగాలి సుధీర్‌ మధ్య ప్రేమకి కారణం ఇదే అంటున్నారు. అలాగే ఇందులోనే ప్రేమించుకుని ఏకంగా పెళ్లి చేసుకున్నారు రాకేష్‌, సుజాత. అలాగే ఫైమా, ప్రవీణ్‌లు కూడా ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. కానీ ఈ మధ్య ఈ ఇద్దరు మధ్య గ్యాప్‌ వచ్చింది. విడిపోయినట్టు ప్రచారం జరిగింది. ఆ మధ్య ప్రవీణ్‌ వేరే అమ్మాయితో  ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. 
 

36

ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇద్దరు కలిశారు. `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలో సందడి చేశారు. ఇటీవల ఫైమా `స్టార్‌ మా` షోస్‌ చేసింది. ఈటీవీకి దూరమయ్యింది. బిగ్‌ బాస్‌ షోలోకి వెళ్లాక ఆమె జబర్దస్త్ ఛాన్స్ ని కోల్పోయింది. దీంతో స్టార్‌ మాతోపాటు ఇతర షోస్‌లో సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలా  రోజుల తర్వాత ఈ ఇద్దరు కలిశారు. రష్మి యాంకర్‌గా ఉన్న ఈ షోలో ఈ ఇద్దరి వ్యవహారాన్ని తేల్చేయాలని నిర్ణయించుకున్నారు. హైపర్‌ ఆది, రష్మి, ఇంద్రజలు కలిసి వీరిని నిలదీశారు. ఏం జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. 
 

46

దీనిపై ఎట్టకేలకు ప్రవీణ్‌ ఓపెన్‌ అయ్యాడు. అసలు విషయం చెప్పే  ప్రయత్నం చేశాడు. తాను ఫైమాకి నచ్చలేదని తెలిపారు. ఆమెనే తనతో నువ్వు నచ్చలేదని చెప్పినట్టు వెల్లడించాడు. అయితే ఇద్దరిని కలిసి పట్టుకోవాలని చెప్పగా, ఫైమా కాస్త ఇబ్బంది పడుతూ కనిపించింది. ఆయనతో మాట్లాడేందుకు కూడా ఇబ్బంది పడుతున్నట్టు కనిపించింది. అంతేకాదు ఇద్దరం మాట్లాడుకుంటున్నామని బలవంతంగా చెప్పింది. 
 

56

ఇది గమనించిన యాంకర్‌ రష్మి.. అసలు విషయాన్ని చెప్పింది. బాగానే ఉంటున్నావని చెబుతున్నావ్‌, కానీ అతన్ని పట్టుకునేందుకే ఇబ్బంది పడుతున్నావని ప్రశ్నించగా, ఫైమా సమాధానం చెప్పలేకపోయింది. ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారు. ఇద్దరి మధ్య ఏదో బలమైన కారణం కనిపిస్తుంది. కానీ అదేంటో చెప్పలేకపోతున్నారు. క్లోజ్‌ కాలేకపోతున్నారు. మరి అదేంటో తెలియాల్సి ఉంది.  మరి ఈ ఎపిసోడ్‌లో ఓపెన్‌ అవుతారా? మళ్లీ కలుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. 

66

కానీ ఫ్యాన్స్ మాత్రం  ఈ ఇద్దరు మళ్లీ కలవాలని, కలిసి జబర్దస్త్ షో చేయాలని కోరుకుంటున్నారు. మరి మళ్లీ కలుస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఎపిసోడ్‌ వచ్చే ఆదివారం ప్రసారం కానుంది. శ్రీదేవి  డ్రామా  కంపెనీ ప్రారంభమై మూడేళ్లు  అయిన సందర్భంగా ఈ ఎపిసోడ్‌ని చాలా స్పెషల్‌గా ప్లాన్‌ చేశారు.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories