పెళ్లి టైమ్ వచ్చినప్పుడే జరుగుతుందని, దాన్ని ప్లాన్ చేయలేమని తెలిపింది. మ్యారేజ్ అనేది లైఫ్‌లో ఒక భాగం మాత్రమే అని అదే జీవితం కాదని, అదే లక్ష్యం కాదని చెప్పింది. అయితే తన పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడటం 18ఏళ్ల క్రిందటే ఆపేశారని తెలిపింది. తన దృష్టిలో మ్యారేజ్ ముఖ్యం కాదని, పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా ఓకే అని చెప్పింది. చాలా మంది మ్యారేజ్ చేసుకోకుండానే ఉంటున్నారని, ఈ సందర్భంగా త్రిషని ఉదాహరణగా చూపించడం గమనార్హం.