అద్దె కట్టలేదని ఓనర్స్ గెంటేశారు... కన్నీళ్లు తెప్పిస్తున్న పటాస్ ఫహీనా దీనగాధ!

First Published | Feb 24, 2021, 11:46 AM IST

బుల్లితెరపై కనిపించే అందరు ఆర్టిస్ట్స్ జీవితాలు అద్భుతంగా ఉంటాయనుకుంటే పొరపాటే. ఫేమ్ నేమ్ వచ్చే వరకు అత్తెసరు సంపాదనతో అష్టకష్టాలు పడాల్సిందే. ఆ కోవకే చెందుతుంది పటాస్ ఫేమ్ ఫహీమా. తాజా ఇంటర్వ్యూలో ఫహీమా దుర్భరమైన తన పేదరికం గురించి చెప్పగా, అందరి మనసు ద్రవించి పోయింది. 
 

ఫహీమా కుటుంబంలో అందరూ ఆడపిల్లలేనట. అద్దెకట్టే స్థోమత లేక రూ 3000వేలకు ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటున్నారట. బాత్రూమ్ కూడా లేని ఆ ఇంటిలో ఆడపిల్లలు బట్టలు అడ్డుగా కట్టి స్నానం చేయాల్సిన పరిస్థితి అని ఆమె చెప్పారు.
ఇక ఫహీమా తల్లిగారు బీడీలు చుట్టే పనికి వెళతారట. ఆమె ఆరోగ్యం సరిగా లేని కారణంగా కొన్నాళ్లుగా పనికి వెళ్లడం లేదట.

అక్కలకు అప్పులు చేసి పెళ్లి చేయగా, ఆ అప్పులు తీర్చడానికి ఫహీమా తండ్రి బయటికి వెళ్లి కష్టపడుతున్నారట. ఆయన ఇంటికి దూరంగా బ్రతుకుతున్నట్లు చెప్పారు ఫహీమా.
చాలా సందర్భాలలో అద్దె కట్టలేక ఇంటి ఓనర్స్ చేత గెంటి వేయబడ్డామని, అనేక మార్లు ఇల్లు మారామని ఫహీమా తన దీన గాధ వివరించారు.
ఇప్పటికి కూడా షోల ద్వారా వస్తున్న సంపాదన తనకే సరిపోవడం లేదట. కుటుంబ ఆర్థిక సమస్యలు తీరలేదని ఫహీమా అన్నారు.
అనేక కష్టాలు ఎదుర్కొంటున్న నేను, బిగ్ బాస్ షో అవకాశం వస్తే వెళతాను అన్నారు.
ఇన్ని సమస్యల మధ్య కూడా కుటుంబం తనకు సపోర్ట్ ఇచ్చిందని, అందుకే ఇక్కడి వరకు వచ్చానని అన్నారు ఫహీమా. అందుకే డబ్బులు సంపాదించి కుటుంబం కోసం ఒక ఇల్లు కొనాలన్నదే తన కోరిక అని తెలియజేసింది.

Latest Videos

click me!