అనసూయకు ఇష్టమైన ప్రదేశంలో... ప్రతిరోజు ఓ రెండు గంటలు అలా..!

First Published | Feb 23, 2021, 7:19 PM IST

ప్రతి టీవీ సెలబ్రిటీ యూట్యూబ్ ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు. వాళ్లకున్న క్రేజ్ నేపథ్యంలో వీడియోలకు మంచి వ్యూస్ రావడంతో ఆదాయం సమకూరుతుంది. 

యాంకర్ అనసూయ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ కలిగి ఉన్నారు.
బుల్లితెర షోలు, వరుస సినిమాల కారణంగా  అనసూయ యూట్యూబ్ ఛానల్ పై ఫోకస్ పెట్టడం లేదు. చాలా కాలం తరువాత అనసూయ ఓ వీడియో పంచుకున్నారు.

ఆ వీడియోలో అనసూయ తన ఇంటిలోని ఫెవరేట్ ప్లేస్ ని పరిచయం చేశారు. ఆ ప్రదేశంలో ప్రతి రోజు రెండు గంటలు ఏమి చేస్తారో చూపించారు.
బాల్కనీ అనసూయకు ఇష్టమైన ప్రదేశం అట. ఇక అక్కడ తన పెట్ యానిమల్స్ తో ఆటలు ఆడుకోవడం, వ్యాయామం వంటివి చేస్తారట.
అలాగే వ్యాయామం తరువాత భర్తతో కలిసి బ్రేక్ పాస్ట్ చేస్తారట. తన దిన చర్యకు సంబందించిన వీడియోని అనసూయ తన అధికారిక యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేశారు.
అయితే ప్రస్తుతానికి జస్ట్ ప్రోమో మాత్రమే అప్లోడ్ చేశారు. ఈనెల 25న పూర్తి వీడియో పంచుకుంటారట. ప్రస్తుతం అనసూయ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇక ఎలాగూ జబర్ధస్త్ తో పాటు కొన్ని టీవీ షోలకు యాంకరింగ్ చేస్తున్నారు అనసూయ. మొత్తంగా అనసూయ కెరీర్ జెట్ స్పీడ్ తో దూసుకు వెళుతుంది.

Latest Videos

click me!