స్వీయ దర్శకత్వంలో బాలకృష్ణ నర్తనశాల చిత్రాన్ని తెరకెక్కించాలని చూశారు. బాలయ్య అర్జునుడు పాత్ర చేయాల్సిన ఆ చిత్రంలో సౌందర్య ద్రౌపది. సౌందర్య అకాల మరణంతో ఆయన డ్రీం ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది.
అయితే ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా తండ్రి పోషించిన పాత్రలు అన్నింటినీ పోషించే అవకాశం దక్కించుకున్నారు బాలయ్య. ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు పేరుతో రెండు భాగాలు విడుదలైంది.
కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ పోషించిన భీష్ముడు రోల్ కూడా బాలయ్య చేయడం జరిగింది. నిడివి ఎక్కువ కావడంతో, భీష్ముడు సన్నివేశాలు ఎడిట్ చేశారట.
నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా బాలకృష్ణ, ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలోని భీష్ముడు లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. భీష్ముడు గెటప్ లో బాలయ్య అద్భుతంగా ఉన్నారు.
ఇక బాలయ్య ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉండగా, గాడ్ ఫాదర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.