రజనీకాంత్ హీరోగా రూపొందిన `జైలర్ 2` భారీ కాస్టింగ్‌తో వస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటుల పారితోషికాల వివరాలు లీక్ అయ్యాయి. ఎవరికి ఎంత అందుతుందో చూస్తే.
సూపర్ స్టార్ రజనీకాంత్ `జైలర్ 2`తో సందడి చేయడానికి వస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో భారీ కాస్టింగ్ నటిస్తోంది. ఆయనకు జోడీగా రమ్యకృష్ణ చేస్తోంది. అలాగే మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియో రోల్స్ చేస్తున్నారు. వీరితోపాటు హృతిక్ రోషన్, విజయ్ సేతుపతిలు కూడా కనిపిస్తారనే ప్రచారం జరుగుతుంది. అలాగే ఎస్ జే సూర్య, మిథున్ చక్రవర్తి, మీర్నా, జాకీ షారఫ్, విద్యా బాలన్, యోగిబాబు వంటి వారు నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం గురువారం(అక్టోబర్ 15)న విడుదల కానుంది.
24
రజనీకాంత్ పారితోషికం హాట్ టాపిక్
ఈ క్రమంలో `జైలర్ 2`లో కాస్టింగ్, టెక్నీషియన్లు ఎంత పారితోషికం తీసుకుంటున్నారు అనే వివరాలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జైలర్ మూవీకిగానూ దాదాపు రెండు వందల కోట్ల పారితోషికం అందుకున్నారు రజనీకాంత్. మొదట వంద కోట్లు అయితే, సినిమా పెద్ద హిట్ కావడంతో మరో వంద కోట్లు పారితోషికంగా ఇచ్చినట్టు సమాచారం. మరి `జైలర్ 2`కి ఆయన ఎంత తీసుకుంటున్నారనేది చూస్తే. దాదాపు రూ.125కోట్ల పారితోషికం ఇస్తున్నారట. అంతేకాదు లాభాల్లో వాటా కూడా ఉంటుందని సమాచారం. వచ్చే కలెక్షన్లని బట్టి ఆయనకు ఇంకా బాగానే రాబోతుందని చెప్పొచ్చు.
34
జైలర్ 2 కాస్టింగ్ పారితోషికాలు
మోహన్లాల్కి రూ.12కోట్లు, శివరాజ్ కుమార్‌కి ఐదు కోట్లు ఇస్తున్నారట. విజయ్ సేతుపతికి దాదాపు 9 కోట్ల వరకు ఇస్తున్నట్టు సమాచారం. వీరితోపాటు జాకీ షరాఫ్కి నాలుగు కోట్లు, మిథున్ చక్రవర్తికి మూడు కోట్లు, యోగిబాబుకి మూడు కోట్లు, విద్యా బాలన్‌కి 6 కోట్లు, రమ్యకృష్ణకి రెండు కోట్లు, సూరజ్‌కి కోటి, ఎస్ జే సూర్యకి మూడు కోట్లు, మిగిలిన మెయిన్ ఆర్టిస్ట్ లకు లక్షల్లో ఇస్తున్నారట. ఇక దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌కి సుమారు రూ.50-60కోట్ల వరకు అందుతుందట. అలాగే సంగీత దర్శకుడు అనిరుధ్‌కి రూ.18కోట్లు ఇస్తున్నట్టు టాక్. ఇలా దాదాపు రూ.250కోట్ల వరకు పారితోషికాలే అవుతున్నాయి. సినిమా బడ్జెట్ రూ.300కోట్లకుపైగానే ఉంటుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సమాచారం మాత్రమే.
ఇందులో రజనీకాంత్ ముత్తువేల్ పాండియన్‌గా నటించారు. ఆయన మొదటిభాగంలో తన కొడుకుని కాపాడుకోవడం కోసం, ఫ్యామిలీ కోసం పోరాటం చేస్తాడు. చివరికి కొడుకే దొంగ అని తెలుస్తుంది. దీంతో కొడుకుని చంపేస్తాడు. చివర్లో మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ల ఎంట్రీ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఇప్పుడు రెండో భాగంలో ఎస్ జే సూర్య, మిథున్ చక్రవర్తి విలన్లుగా, స్మగ్లర్‌గా ఉంటారట. విద్యా బాలన్ కూడా నెగటివ్ రోల్లోనే కనిపిస్తుందని సమాచారం. వీరితో ముత్తువేల్ పాండియన్ చేసే పోరాటమే కథగా ఉంటుందని సమాచారం. సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ `జైలర్ 2` అనే ట్యాగ్ తో హైప్ క్రియేట్ అవుతుంది. దాన్ని ఈ సినిమా ఎంత వరకు అందుకుంటుందో చూడాలి.