Animal: యానిమల్ లో నటించి ఉంటే నాకు పెళ్లి అయ్యేది కాదు.. అసలేం జరిగిందో చెప్పిన పరిణీతి చోప్రా

Published : Apr 28, 2026, 08:30 AM IST

'యానిమల్' సినిమాకు మొదట నన్నే హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ డేట్స్ సమస్య వల్ల 'అమర్ సింగ్ చమ్కీలా' సినిమాను ఎంచుకున్నా. ఆ నిర్ణయం వల్లే నాకు రాఘవ్ చద్దా భర్తగా దొరికాడు. 

PREV
16
యానిమల్​ హవా
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన 'యానిమల్' సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. మహిళలపై హింస, అశ్లీలత ఉన్నాయని విమర్శలు వచ్చినా, ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
26
రష్మిక బదులు పరిణీతి
నిజానికి ఈ సినిమాలో రష్మిక మందన్న చేసిన గీతాంజలి పాత్రకు మొదట పరిణీతి చోప్రాను ఎంపిక చేశారు. అప్పటికి ఆమెకు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో ఇంకా పెళ్లి కాలేదు. షూటింగ్ మొదలయ్యే సమయంలో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
36
కారణం ఏంటి?
'యానిమల్' సినిమాను పరిణీతి తిరస్కరించడానికి ముఖ్య కారణం డేట్స్ కుదరకపోవడమే. ఆ సమయంలో ఆమె ఇంతియాజ్ అలీ డైరెక్షన్‌లో 'అమర్ సింగ్ చమ్కీలా' సినిమా చేస్తున్నారు. రెండింటిలో ఒకటి వదులుకోవాల్సి రావడంతో, ఆమె 'చమ్కీలా'ను ఎంచుకున్నారు. ఆ సినిమాతో కూడా పరిణీతికి మంచి పేరు వచ్చింది.
46
రాఘవ్​ తో పెళ్లి
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 'అమర్ సింగ్ చమ్కీలా' సినిమాకు బదులుగా 'యానిమల్' చేసి ఉంటే, తనకు రాఘవ్ చద్దాతో పెళ్లి అయ్యేది కాదట. ఈ విషయాన్ని ఆమె రజత్ శర్మా షోలో స్వయంగా వెల్లడించారు.
56
ఆ నిర్ణయం ఎందుకు?
'చమ్కీలా'లో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటం, ఏ.ఆర్. రెహమాన్ సంగీతంతో పనిచేసే అవకాశం రావడంతో ఆ నిర్ణయం తీసుకున్నానని పరిణీతి చెప్పారు. 'యానిమల్' 900 కోట్లకు పైగా వసూలు చేసినా, తనకు ఏమాత్రం బాధ లేదన్నారు. ఎందుకంటే 'చమ్కీలా'లోని అమర్‌జోత్ పాత్ర తనకు గొప్ప కీర్తిని తెచ్చిపెట్టిందని తెలిపారు.
66
షూటింగ్​లో రాఘవ్​ చద్దా భేటీ
"అదే సినిమా షూటింగ్ సమయంలో నేను రాఘవ్‌ను కలిశాను. అక్కడే మా మధ్య మాటలు మొదలై, ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నాం. ఒకవేళ 'యానిమల్' ఒప్పుకుని ఉంటే, బహుశా రాఘవ్ నాకు దొరికేవాడు కాదు" అని పరిణీతి చెప్పుకొచ్చారు.
Read more Photos on
click me!

Recommended Stories