Ram Charan తో ఐటెం సాంగ్స్ చేసిన హీరోయిన్లు ఎంత మంది ఉన్నారో తెలుసా.. ఇప్పుడు అందరి చూపు ఆమెపైనే

Published : Apr 28, 2026, 07:00 AM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలసి కొందరు హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేశారు. ఆ సినిమాలు ఏంటి, ఐటెం సాంగ్స్ చేసిన హీరోయిన్లు ఎవరు అనే వివరాలు ఈ కథనంలో ఉన్నాయి. 

PREV
17
Ram Charan

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం జూన్ లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో ఐటెం సాంగ్ గురించి చర్చ జరుగుతోంది. ఈ మూవీలో ఐటెం సాంగ్ కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరికి ఓ హీరోయిన్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాంచరణ్ తో ఇప్పటి వరకు ఐటెం సాంగ్స్ చేసిన నటీమణులు ఎవరో తెలుసుకుందాం.

27
మగధీర

మగధీర చిత్రంలో ముమైత్ ఖాన్ స్పెషల్ సాంగ్ చేసింది. బంగారు కోడిపెట్ట సాంగ్ ని రీమిక్స్ చేశారు. ముమైత్ ఖాన్ చిన్న రోల్ తో పాటు ఈ సాంగ్ కూడా చేసింది.

37
నాయక్

ఈ చిత్రంలో ఛార్మి ఐటెం సాంగ్ చేసింది. రాంచరణ్, ఛార్మి ఇద్దరూ డ్యాన్స్ ఇరగదీశారు. ఇప్పటికీ నాయక్ మూవీలోని ఐటెం సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ ఉంటుంది.

47
ఎవడు

ఎవడు మూవీలో అయ్యో పాపం అనే ఐటెం సాంగ్ ఉంది. క్యాచీ ట్యూన్ తో ఆకట్టుకునే పాట ఇది. ఈ సాంగ్ లో బ్రిటిష్ నటి మోడల్ స్కార్లెట్ విల్సన్ పెర్ఫామ్ చేసింది.

57
రంగస్థలం

రాంచరణ్ సినిమాల్లో బెస్ట్ ఐటెం సాంగ్ అంటే రంగస్థలం చిత్రంలోనిదే. జిల్ జిల్ జిగేలు రాణి అనే ఐటెం సాంగ్ లో క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటించింది. ఈ సాంగ్ యువతని, మాస్ ప్రియులని ఒక ఊపు ఊపేసింది.

67
వినయ విధేయ రామ

ఈ మూవీలో నార్త్ బ్యూటీ ఇషా గుప్తా స్పెషల్ సాంగ్ చేసింది. ఏక్ బార్ అనే సాంగ్ లో రాంచరణ్ తో కలసి డ్యాన్స్ చేసింది.

77
పెద్ది

ఇక త్వరలో రాబోతున్న పెద్ది చిత్రంలో శ్రుతి హాసన్ ఐటెం సాంగ్ చేయబోతోంది. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతోందో చూడాలి. శ్రుతి హాసన్ ఆల్రెడీ ఆగడు మూవీలో ఐటెం సాంగ్ చేసింది. రాంచరణ్ తో కలసి ఎవడు మూవీలో ఆమె హీరోయిన్ గా నటించింది.

Read more Photos on
click me!

Recommended Stories