హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ నేత రాఘవ్ దంపతులు సోషల్ మీడియాలో తాము తల్లి దండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. దీనితో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పరిణీతి చోప్రా బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తోంది. రాఘవ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.
DID YOU KNOW ?
బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్న పరిణీతి చోప్రా
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం యానిమల్ లో హీరోయిన్ గా నటించే అవకాశం ముందుగా పరిణీతికి వచ్చింది. కానీ డేట్స్ కారణంగా పరిణీతి ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసింది. దీనితో ఆ గోల్డెన్ ఛాన్స్ రష్మికకి దక్కింది.
25
అందమైన పోస్ట్ తో ప్రెగ్నన్సీ ప్రకటించిన పరిణీతి
సెప్టెంబర్ 24, 2023న ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ హోటల్‌లో వివాహం చేసుకున్న ఈ జంట, సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తమ జీవితంలోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ న్యూస్ ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఒక అందమైన కేక్ ఫోటోను పోస్ట్ చేశారు. ఆ కేక్‌పై “1 + 1 = 3” అని రాసి ఉండగా, మధ్యలో చిన్న బంగారు అడుగుల ముద్రలు కనిపించాయి. మా సరికొత్త ప్రపంచం వచ్చేస్తోంది.. ఈ ఆనందాన్ని వెలకట్టలేం అని క్యాప్షన్ ఇచ్చారు. అలాగే, వీరు పంచుకున్న వీడియోలో పరిణీతి, రాఘవ్ ఇద్దరూ చేతులు పట్టుకొని పార్కులో నడుస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ విధంగా తామిద్దరం తల్లి దండ్రులు కాబోతున్న విషయాన్ని పరిణీతి, రాఘవ్ దంపతులు ప్రకటించారు.
35
సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
ఈ శుభవార్త బయటికొచ్చిన వెంటనే, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. నటి సోనం కపూర్ “Congratulations darling” అని రాయగా, నటి భూమి పెడ్నేకర్ కూడా అభినందనలు తెలిపారు.కొన్ని రోజుల క్రితమే రాఘవ్ 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పాల్గొన్నప్పుడు తాము తల్లి దండ్రులు కావడం గురించి హింట్ ఇచ్చారు. హోస్ట్ కపిల్ శర్మతో మాట్లాడుతూ, “త్వరలోనే గుడ్ న్యూస్ ఇస్తాం” అని చెప్పారు. ఇప్పుడు అదే నిజమైంది.
పరిణీతి చోప్రా బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి కాగా, రాఘవ్ చద్ధా ఆప్ పార్టీకి చెందిన ప్రముఖ యువ నాయకుడు. వివాహం తర్వాత కూడా వీరు తరచుగా సోషల్ మీడియాలో ఒకరినొకరు ప్రోత్సహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు, తమ బిడ్డ రాబోతున్న శుభవార్తతో మళ్లీ హైలైట్ అయ్యారు.
55
పరిణీతి చిత్రాలు
పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా ఇద్దరూ బంధువులు. పరిణీతి చోప్రా 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ అనే చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ, పరిణీతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ తర్వాత పరిణీతి శుధ్ దేశీ రొమాన్స్, కిల్ దిల్, నమస్తే ఇంగ్లాండ్, గోల్ మాల్ అగైన్, కేసరి లాంటి చిత్రాల్లో నటించింది.