మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న పెద్ది మూవీపై తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. గేమ్ ఛేంజర్ నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ అంతా పెద్ది మూవీపైనే ఆశలు పెట్టుకుని ఉన్నారు. బుచ్చిబాబు దర్శకత్వంపై అందరిలో నమ్మకం ఉంది. వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
DID YOU KNOW ?
తొలి చిత్రంతోనే నేషనల్ అవార్డు
బుచ్చిబాబు తెరకెక్కించిన తొలి చిత్రం ఉప్పెనకి బెస్ట్ ఫీచర్ ఫిలిం తెలుగు విభాగంలో నేషనల్ అవార్డు దక్కింది. ఈ చిత్రాన్ని ఉత్తమ దర్శకుడిగా బుచ్చిబాబు ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.
25
టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్
ఈ చిత్రంలో జగపతి బాబు, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతోంది. రాంచరణ్ ఈ చిత్రం కోసం పూర్తిగా తన మేకోవర్ మార్చుకున్నారు. ఆ మధ్యన విడుదలైన టీజర్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. రాంచరణ్ కొట్టిన క్రికెట్ షాట్ ఫ్యాన్స్ కి భలే థ్రిల్లింగ్ గా అనిపించింది.
35
పెద్ది మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసిన మలయాళీ నటి
తాజాగా ఈ చిత్రం గురించి ఊహించని న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం మలయాళీ నటి శ్వాసికని సంప్రదించారట. కానీ ఆ పాత్రని తాను రిజెక్ట్ చేసినట్లు స్వయంగా శ్వాసిక ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటైన పెద్ది చిత్రాన్ని ఆమె రిజెక్ట్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
అయితే తాను ఆ పాత్రని ఎందుకు రిజెక్ట్ చేశానో అనేది శ్వాసిక వివరించింది. పెద్ది చిత్రంలో రాంచరణ్ కి తల్లిగా నటించాలని శ్వాసికని అడిగారట. తల్లిగా నటించడం ఇష్టం లేక పెద్ది చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు శ్వాసిక పేర్కొంది. నా వయసు ఇప్పుడు 33 ఏళ్ళు. ఈ వయసులోనే తల్లి పాత్రల్లో నటించడం నాకు ఇష్టం లేదు. తమిళ మూవీ లబ్బర్ పందులో హీరోయిన్ తల్లిగా నటించా. అప్పటి నుంచి చాలా చిత్రాల్లో తల్లి రోల్స్ వచ్చాయి.
55
చివరగా నితిన్ తమ్ముడు మూవీలో..
కానీ తనకి అప్పుడే తల్లి పాత్రల్లో నటించడం కంఫర్టబుల్ గా అనిపించడం లేదని శ్వాసిక పేర్కొంది. శ్వాసిక చివరగా తెలుగులో నితిన్ తమ్ముడు చిత్రంలో నటించింది. శ్వాసిక రిజెక్ట్ చేయడంతో రాంచరణ్ తల్లిగా నటించే మరో నటి ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో పెద్ది చిత్రం రూపొందుతోంది.