ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తున్న నవదీప్.. వెళ్లి కూసో పో, గొడవకి దిగిన శ్రీజ నోరు ఎలా మూయించాడో తెలుసా

Published : Aug 25, 2025, 10:54 AM IST

బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో ఉత్కంఠభరితమైన టాస్క్ లతో సాగుతోంది. కంటెస్టెంట్స్ కి నవదీప్ వార్నింగ్ ఇస్తున్న విధానం హైలైట్ అవుతోంది. 

PREV
15
అగ్నిపరీక్షలో కఠినమైన టాస్కులు

బిగ్ బాస్ అగ్నిపరీక్ష షో రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ కి జడ్జీలు కఠినమైన టాస్క్ లు ఇస్తూ నిజగానే అగ్నిపరీక్ష పెడుతున్నారు. నవదీప్, అభిజీత్, బిందు మాధవి ఈ షోలో న్యాయ నిర్ణేతలుగా ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ లోకి పంపేందుకు ప్రతిభ గల టాప్ 5 కామనర్స్ ని వీళ్ళు ఎంపిక చేయాలి. అందుకే కంటెస్టెంట్స్ లో సత్తా బయట పెట్టేందుకు వైవిధ్యమైన, మైండ్ గేమ్ తో కూడిన టాస్క్ లు ఇస్తున్నారు.

25
లేటెస్ట్ ప్రోమో వైరల్

ఎపిసోడ్ 4కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ప్రోమోలో చూపిన దాని ప్రకారం శ్రీముఖి కంటెస్టెంట్స్ కి ఒక టాస్క్ గురించి వివరిస్తోంది. ఈ టాస్క్ ప్రకారం తెలిసిన వాళ్లకు ఎవరికైనా ఫోన్ చేసి తమ అకౌంట్ లో వెంటనే డబ్బులు వేయించుకోవాలి. దానిని బట్టి విజేతలని నిర్ణయిస్తారు. అందరూ డబ్బులు వేయించుకుంటే ఎవరు ఎక్కువ అమౌంట్ వేయించుకున్నారు అనేది పరిగణలోకి వస్తుంది.

35
గొడవకి దిగిన శ్రీజ దమ్ము

ఈ టాస్క్ పై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన శ్రీజ దమ్ము అభ్యంతరం చెబుతుంది. జడ్జీలు సరిగ్గా టాస్క్ గురించి వివరించలేదని ఆర్గుమెంట్ కి దిగింది. ఈ టాస్క్ న్యాయబద్దంగా జరగలేదని ఎవరైనా భావిస్తే వచ్చి మాట్లాడవచ్చు అని శ్రీముఖి తెలిపింది. దీనితో శ్రీజ దమ్ము వెంటనే ముందుకు వచ్చింది. టాస్క్ క్లియర్ గా వివరించలేదు. కన్ఫ్యూజ్ చేశారు అని చెప్పడంతో.. కన్ఫ్యూజ్ అయితే అది ఎవరి తప్పు అని నవదీప్ కౌంటర్ ఇచ్చారు.

45
కౌంటర్ ఇచ్చిన నవదీప్

నువ్వు ఇక మాట్లాడడానికి వీల్లేదు వేళ్ళు కూసో పో అంటూ నవదీప్.. శ్రీజ నోరు మూయించారు. 16 మంది సభ్యులు 9 స్థానాల కోసం డేర్ ఆర్ డై అనే టాస్క్ లో పోటీ పడుతున్నారు. ఈ ఎపిసోడ్ కి ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అతిథిగా హాజరవుతున్నట్లు ప్రోమోలో చూపించారు.

55
చుక్కలు చూపిస్తున్నాడు

తమ ఫోన్లని సుత్తితో పగలగొట్టే టాస్క్ కూడా ఇచ్చారు. డేర్ ఆర్ డై టాస్క్ లో చేస్తానని ముందుకు వచ్చి దానిని కంప్లీట్ చేయకపోతే వాళ్ళు ఈ షో నుంచి బయటకి వెళ్ళిపోతారు అంటూ నవదీప్ వార్నింగ్ ఇస్తున్నారు. చూస్తుంటే నవదీప్ కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తున్నట్లు అర్థం అవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories