ఇంతలోనే అక్కడికి ప్రేమ్ వస్తాడు. అప్పుడు నందు నాన్న మారేవరకు ఎన్ని రోజులైనా ఎదురు చూడాల్సిందే అని అంటాడు. ఇప్పుడు లాస్య, అనసూయని నోరు అదుపులో పెట్టుకోమని చెబుతాడు నందు. అప్పుడు అనసూయ నువ్వు వెళ్లాల్సిందేనా అని అనడంతో అవసరం లేకుండా నేను కూడా ఎందుకు బయలుదేరుతాను అమ్మ అని అంటాడు. అప్పుడు నందు అక్కడనుంచి వెళ్లిపోయిన తర్వాత లాస్య తన మాటలతో అనసూయని రెచ్చ గొడుతూ ఉంటుంది. మరొకవైపు తులసి పూజ చేస్తూ తన మనసులోని మాటలు దేవుడికి చెప్పుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సామ్రాట్ బయలుదేరుతూ వెళ్తూ ఉండగా అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ కి నిర్ణయం తీసుకునే ముందైనా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని అంటాడు.