విక్కీ కౌశల్ కు కత్రీనా కైఫ్ కండీషన్లు, పెళ్ళికి ముందు నుంచే కంట్రోల్లో పెట్టిన స్టార్ బ్యూటీ..?

First Published | Nov 16, 2022, 9:54 AM IST

బాలీవుడ్ తారలు కత్రీనా కైఫ్ - విక్కీ కౌశల్ పెళ్ళి జరిగి వచ్చే నెలకు ఏడాది కావస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ జంటకు సబంధించిన చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. పెళ్ళికి ముందే కత్రీనాకు విక్కీ పెట్టిన కండీషన్లు గురించి సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ .. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్ళాడింది. తనకంటే చిన్నవాడిని పెళ్ళి చేసుకుంది కత్రీనా. వీరి ప్రేమ.. పెళ్ళి బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది అప్పట్లో. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది బ్యూటీ. 

తెలుగులో మల్లీశ్వరి సినిమాతో  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. దాదాపు 20 ఏళ్ళు బాలీవుడ్ ను ఏలింది కత్రీనా.  ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాల్లో... మంచి మంచి సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ .. దూసుకుపోతోంది. 
 


Katrina Kaif

అంతే కాదు యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండీ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ..సిల్వర్ స్క్రీన్ తో పాటు సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోతోంది బ్యూటీ. ప్యాన్ ఫాలోయింగ్ ను భారీగా పెంచుకుంటుంది బ్యూటీ. 

అయితే ప్రస్తుతం కత్రీనాకు సబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.  విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్.. వీళ్ల డేటింగ్ టైం లో నే విక్కీ కౌశల్ కు కొన్ని కండిషన్స్ పెట్టిందట . మరీ ముఖ్యంగా పెళ్లి చేసుకోవడానికి ఆమె పెట్టిన కండిషన్స్ నివ్వెరపోయేలా ఉన్నాయట.  
 

క్రేజీ కండిషన్ పెట్టి.. విక్కీ కౌశల్ కి షాక్ ఇచ్చిందట కత్రీన,.. ఇంతకీ ఆమె పెట్టిన కండీషన్స్ ఏంటీ అంటే..? పెళ్లికి ముందు ఎలా ఉందో.. పెళ్లి  తర్వాత కూడా ఎవరి సంపాదన వారిదే..  భార్య భర్తలు అంటే కష్టసుఖాలు, సంపాదనలలో కూడా నీది నాది అని లేకుండా  పాలుపంచుకుంటారు. కాని కత్రీనా మాత్రం అంతా సెపరేట్ అంటోందట. 
 

Katrina Kaif, Vicky Kaushal share screen space for the first time

కత్రినా మాత్రం పెళ్లి తర్వాత ..నీ డబ్బు నీది, నా డబ్బు నాది ..అన్న ఒక కండిషన్ పెట్టిందట . నీకు ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది.. ఎందుకు డబ్బులు వాడుతున్నావు అని నేను అడగను ..నువ్వు కూడా నా రెమ్యూనరేషన్ తో పాటు నా ఆస్తుల జోలికి రావద్దు అని ముందే మాట తీసుకుందట. 
 

Katrina Kaif Vicky

అంతే కాదు ఏదైనా స్థిరాస్తులు కొనాలన్నా.. ఇద్దరు సమాన శేర్ లో కొని.. సమానంగా పంచుకోవాలి అని కండీషన్ పెట్టిందట.  అంతే కాదు.. నేను ఖర్చు చేస్తున్నందుకు నువ్వు అరవకూడదు..నా మీద పెత్తనం చెలాయించకూడదు ..నా డబ్బులు ఏమైనా చేసుకుంటాను అని ముఖం మీదే చెప్పేసిందట. 

Image: Katrina KaifInstagram

నా ఖర్చులు నావి.. నా టూర్లకు అట్టు చెప్పొద్దు.. నేను మేకప్ కిట్స్ కొనుక్కుంటాను.. ఏమైనా చేసుకుంటాను. నువ్వు మాత్రం అడగొద్దు. అంతే కాదు నువ్వు ఏం చేసినా నేను అడగను.. నువ్వు తాగినా..   ఫ్రెండ్స్ కి ఖర్చు చేసినా అడగను.. ఏదైనా సరే ఫ్యామిలీకి పెట్టాలి అనుకున్న టైంలో ఇద్దరం షేర్ చేసుకొని పెట్టుకుందాం.. అంటూఇంకా చాలా కండీషన్స్ అప్లై చేసి మరీ పెళ్ళాడిందట. 

అయితే చాలా మంది స్టార్లు బ్రేకప్ లు చెప్పుకోవడం. పెళ్లి  తరువాత విడిపోవడం లాంటివి జరుగుతుండటంతో.. ముందు జాగ్రత్తగా కత్రీనా ఇలా చేసి ఉంటుంది అని ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఇందేం పైత్యం... అది కాపురమా.. బిజినెస్ డీలా.. అంటూ మండి పడుతున్నారు. ఏది ఏమైనా... ప్రస్తుతం ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అంవుతోంది.  
 

Latest Videos

click me!