జై హనుమాన్ ఫస్ట్ లుక్: హనుమంతుడిగా పాన్ ఇండియా స్టార్, 1000 కోట్లు పక్కా ..గూస్ బంప్స్ తెప్పిస్తున్న పోస్టర్

First Published Oct 30, 2024, 6:29 PM IST

విజనరీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ట్రూ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ జై హనుమాన్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో చేతులుకలిపారు. యావత్ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ తాజాగా చిత్రం యూనిట్ జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

విజనరీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ట్రూ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ జై హనుమాన్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో చేతులుకలిపారు. యావత్ దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ తాజాగా చిత్రం యూనిట్ జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. హనుమంతుడిగా పాన్ ఇండియా స్టార్ కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. 
 

సమకాలీన కథలను పౌరాణిక కథలతో అద్భుతంగా బ్లెండ్ చేయడంలో ప్రశాంత్ వర్మ గొప్పపేరు తెచ్చుకున్నారు. రిషబ్ శెట్టి కాంతార తో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఆయన కాంతారా సీక్వెల్ లో బిజీగా ఉన్నారు. అయితే జై హను మాన్ లో రిషబ్ శెట్టి నటిస్తుండడం ఆయనకి మైండ్ బ్లోయింగ్ ఆఫర్ అనే చెప్పొచ్చు. తాజాగా దీపావళి సెలెబ్రేషన్స్ రెట్టింపు చేస్తూ జై హనుమాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టి హనుమంతుడిగా గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. పోస్టర్‌లో రిషబ్ శెట్టి హనుమంతునిగా పవర్ ఫుల్ పోజ్ లో, శ్రీరాముని విగ్రహం చేతిలో భక్తిపూర్వకంగా పట్టుకొని అతని పాదాల మీద కూర్చొని కనిపించారు.
 

Latest Videos


ఈ అద్భుతమైన పోస్టర్ రిషబ్ ఫిజికాలిటీని హైలైట్ చేయడమే కాకుండా హనుమంతునికి సంబంధించిన లోతైన భక్తి, శక్తిని ప్రజెంట్ చేస్తోంది. పాత్ర చిత్రీకరణ లెజెండరీ లక్షణాలతో సంపూర్ణం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది, ఈ అద్భుత పాత్రకు అతను తెరపై ఎలా జీవం పోస్తాడో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ప్రశాంత్ వర్మ మరింత గొప్ప కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు, ఈ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అది స్పష్టంగా కనిపిస్తుంది.
 

హనుమంతుని మౌనం శరణాగతి కాదు, ప్రయోజనం కోసం వేచి ఉంది. జై హనుమాన్ అనేది విడదీయరాని భక్తికి, అన్ని అసమానతలను ధిక్కరించే ప్రతిజ్ఞ యొక్క బలానికి నివాళి. అమర స్ఫూర్తిని జరుపుకునే గొప్ప సినిమాటిక్ జర్నీని ఎక్స్ పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ చిత్ర యూనిట్ పేర్కొన్నారు. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగం. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని మ్యాసీవ్ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. 

హను మాన్ ఫస్ట్ పార్ట్ మొత్తం తేజ సజ్జా పాత్రతోనే ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ చిత్రం విడుదలై పాన్ ఇండియా వ్యాప్తంగా 400 కోట్ల వరకు వసూళ్లు కొల్లగొట్టింది. ఈసారి పక్కా ప్రణాలికతో భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు మైత్రి మూవీస్ సంస్థ, ప్రశాంత్ వర్మ సిద్ధం అవుతున్నారు. పైగా రిషబ్ శెట్టి లాంటి పాన్ ఇండియా స్టార్ ని హనుమంతుడు పాత్రకి తీసుకోవడంతో ఈ చిత్రం 1000 కోట్లు సాధించడం పక్కా అంటూ అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. 

click me!