చిరు, బన్నీ, నితిన్ ముగ్గురికీ ఇష్టమైన కొరియోగ్రాఫర్..గిఫ్టులుగా ల్యాప్ టాప్, వాచ్..తల పగిలినా ఏమి అనలేదు

First Published Oct 30, 2024, 6:01 PM IST

టాలీవుడ్ లో డ్యాన్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. తన డ్యాన్స్ తో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని సైతం మెగాస్టార్ కొల్లగొట్టారు. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది ట్యాలెంటెడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు.

టాలీవుడ్ లో డ్యాన్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. తన డ్యాన్స్ తో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని సైతం మెగాస్టార్ కొల్లగొట్టారు. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది ట్యాలెంటెడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. వారిలో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, ప్రేమ్ రక్షిత్ లాంటి వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తుంటాయి. 

హీరోల్లో చిరంజీవితో పాటు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రాంచరణ్, నితిన్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. చిరంజీవి, అల్లు అర్జున్, నితిన్ లకు బాగా ఇష్టమైన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఒక్కరున్నారట. ఆయనే శేఖర్ మాస్టర్. ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ చిరంజీవి సర్, బన్నీ గారు, నితిన్ గారు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. నేను కూడా వాళ్ళ విషయంలో అంతే జాగ్రత్తగా ఉంటాను. వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా సాంగ్ బాగా వచ్చేందుకు ప్రయత్నిస్తాను అని శేఖర్ మాస్టర్ తెలిపారు. 

Latest Videos


ఖైదీ నెంబర్ 150 చిత్రంలో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ కి కొరియోగ్రఫీ చేసింది శేఖర్ మాస్టర్. బెల్ట్ ని అటు ఇటూ తిప్పుతూ చేసే స్టెప్ విషయంలో శేఖర్ మాస్టర్ చాలా కష్టపడ్డారట. ఆ స్టెపును నా అసిస్టెంట్స్ నేను అనుకున్నట్లు చేయలేకున్నారు. చిరంజీవి గారు చేస్తారో లేదో అని టెన్షన్ పాడ్డా. కానీ చిరంజీవి ఫస్ట్ టేక్ లోనే అద్భుతంగా ఆ స్టెప్పుని ఫినిష్ చేశారు. దటీస్ మెగాస్టార్. ఆ స్టెప్పు చిరంజీవి గారికి బాగా నచ్చింది. వెంటనే రాంచరణ్ ని పిలిపించి కాస్ట్లీ ల్యాప్ టాప్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ ల్యాప్ ట్యాప్ ని ఇంతవరకు వాడకుండా భద్రంగా దాచిపెట్టా అని శేఖర్ మాస్టర్ తెలిపారు. 

అదే విధంగా అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో చిత్రంలో టాప్ లేచిపోద్ది సాంగ్ కి వాచ్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలిపారు. హీరో నితిన్ తో ఒక ఊహించని అనుభవం ఉంది. కొరియర్ బాయ్ కళ్యాణ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో నితిన్ ఒక స్టెప్పు వేసి జూనియర్ ఆరిస్టులపై ఎగిరి పడాలి. కానీ వాళ్ళు పట్టుకోవడం మిస్ చేశారు. 

ఓ షాపింగ్ మాల్ లో షూటింగ్ జరుగుతోంది. దీనితో నితిన్ మెట్లపై పడ్డారు. తల పగిలినంత పని అయింది. నాకు బిపి పెరిగిపోయి జూనియర్ ఆర్టిస్టులని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నా. వెంటనే నితిన్ వచ్చి మాస్టర్ ఏమి కాలేదు.. మీరు టెన్షన్ అవ్వొద్దు. పది నిమిషాల్లో తగ్గిపోతుంది అని క్యారవాన్ లోకి వెళ్లారు. 10 నిమిషాల తర్వాత వచ్చి షూటింగ్ ఫినిష్ చేసినట్లు శేఖర్ మాస్టర్ తెలిపారు. నన్ను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు అని శేఖర్ మాస్టర్ ఆ సంఘటనని గుర్తు చేసుకున్నారు. 

click me!