ఈ ఏడాది ఆగస్టు 8న నాగ చైతన్య, శోభితా దులిపాల నిశ్చితార్థం వేడుక జరిగింది. తన కుమారుడు, కాబోయే వధువుతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను Xలో పోస్ట్ చేస్తూ నాగార్జున ఈ శుభవార్తను ప్రకటించారు. “మా కుమారుడు నాగ చైతన్య, శోభితా దులిపాలల నిశ్చితార్థం ఈ ఉదయం 9:42 గంటలకు జరిగింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాము అని వారు ప్రకటించారు.
ఆమెను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. నూతన జంటకు అభినందనలు! వారికి జీవితాంతం ప్రేమ, ఆనందం కలగాలని కోరుకుంటున్నాము. దేవుడు దీవించుగాక! 8.8.8. అనంతమైన ప్రేమ ప్రారంభం.” అనే అందమైన సందేశం ట్విట్టర్ లో పెట్టారు నాగార్జున.