పల్లవి ప్రశాంత్‌ అన్నపూర్ణ స్టూడియో గేట్‌ ఘటన గుర్తు చేయగానే శివాజీ గగ్గోలు.. ఇజ్జత్‌ అంతా పోయిందని రచ్చ

Published : Jan 10, 2024, 11:44 PM ISTUpdated : Jan 11, 2024, 12:05 AM IST

బిగ్‌ బాస్‌ 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ అన్నపూర్ణ స్టూడియో గేటు సంఘటన గుర్తు చేశాడు. దీంతో శివాజీ గగ్గోలు పెట్టుకున్నాడు. అంతేకాదు నాగార్జున సమక్షంలో అంతా కలుసుకుని రచ్చ చేశారు.  

PREV
16
పల్లవి ప్రశాంత్‌ అన్నపూర్ణ స్టూడియో గేట్‌ ఘటన గుర్తు చేయగానే శివాజీ గగ్గోలు..  ఇజ్జత్‌ అంతా పోయిందని రచ్చ

బిగ్‌ బాస్‌ 7 తెలుగు బాగా పాపులర్‌ అయ్యింది. ఇందులో కంటెస్టెంట్లు పాపులర్‌ అయ్యారు. చివర్లో పెద్ద రచ్చ అయ్యింది. దీంతో ఇప్పటికీ అది హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఆ సంఘటనలు వైరల్‌గా మారుతున్నాయి. బిగ్‌ బాస్‌ తెలుగు 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ విజేత నిలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద రచ్చ అయిన విషయం తెలిసిందే. అభిమానుల మధ్య గొడవ జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. తన అభిమానులను ప్రశాంత్‌రెచ్చగొట్టాడంటూ పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. జైలుకి కూడా పంపించారు. 
 

26

కోర్ట్ పల్లవి ప్రశాంత్‌కి షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. దీంతో ఆయన మీడియాని, అభిమానులకు దూరంగా ఉంటున్నారు. చాలాసెలక్టీవ్‌గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ల ఫ్యామిలీ ఫంక్షన్లలో, సినిమా ఫంక్షన్లలో సందడి చేస్తున్నాడు. తాజాగా ఆయన `నా సామి రంగ` అనే సంక్రాంతి ప్రోగ్రామ్‌లో సందడి చేశారు. బిగ్‌ బాస్‌ 7 కంటెస్టెంట్లు అంతా కలిసి ఈ షో చేశారు. ఓ వైపు రీ యూనియన్‌ తరహాలో ఈ సంక్రాంతికి ఈ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. ఇందులో నాగార్జున కూడా పాల్గొన్నారు. ఆయన `నా సామి రంగ` సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో తన టీమ్‌ పాల్గొని సందడి చేసింది. 
 

36

బిగ్‌ బాస్‌లో స్పా బ్యాచ్‌, స్పై బ్యాచ్‌ పాపులర్‌ అయినట్టుగానే ఈ షోలోనూ రెండు టీమ్‌లుగా విడిపోయారు. శివాజీ, పల్లవి ప్రశాంత్‌, యావర్‌తో కూడిన మొక్కాపురం గ్రామం, అమర్‌ దీప్‌, శోభా శెట్టి, ప్రియాంకలతోపాటు తన టీమ్‌ తో సుక్కాపురం గ్రామం అని రెండు టీమ్‌లుగా విడిపోయారు. అయితే ప్రారంభంలోనే అన్నపూర్ణ స్టూడియోని గుర్తు చేసుకున్నారు పల్లవి ప్రశాంత్‌. తన టీమ్‌ లీడర్‌ శివాజీ.. ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారా? లేదా అనగా, `అన్నా అన్నపూర్ణ స్టూడియో గేటు ముందట పటాకులన్నీ పెట్టేశాను అన్నా` అని ప్రశాంత్‌ బదులిచ్చాడు. 
 

46

దీంతో దెబ్బడిపోయిన శివాజీ.. గగ్గోలు పెట్టుకున్నాడు. చిర్రెత్తిపోయిన ఆయన `ఈ అన్నపూర్ణ గేటు మర్చిపోరా..ఇప్పటికే ఇజ్జత్‌ మొత్తం పీకింది మనకు` అంటూ వాపోయాడు శివాజీ. దీంతో పల్లవి ప్రశాంత్‌ సైతం వామ్మో అంటూ తన మిస్టేక్‌ని తెలుసుకున్నాడు. కాసేపు వీరి కామెడీ స్కిట్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది. ఇక ఇందులో పల్లవి ప్రశాంత్‌, అమర్ దీప్‌.. నాగార్జున మా ఊరికే వస్తున్నారంటూ మరోసారి రెచ్చిపోయి వాదించుకున్నారు.

56

ఇందులో బిగ్‌ బాస్‌ 7 హోస్ట్, `నా సామి రంగ` హీరో నాగార్జున తన టీమ్‌తో కలిసి సందడి చేశారు. ఇందులో తనదైన కామెడీతో నవ్వించారు. తనపై ఇతర కంటెస్టెంట్లు, సీరియల్‌ యాక్టర్స్ అభిమానం వ్యక్తం చేయడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.  తన సినిమా గురించి, సంక్రాంతి గురించి ఆయన వెలడించారు. కంటెస్టెంట్లని ఆటపట్టించాడు. 
 

66

ఇందులో చివర్లో రైతు గొప్పతనం చెప్పేలా పల్లవి ప్రశాంత్‌ ఓ కళారూపం ప్రదర్శించారు. ఆద్యంతం ఎమోషనల్‌గా సాగే ఈ స్కిట్ భావోద్వేగానికి గురి చేసింది. రైతుల ఆత్మహత్యలను, పంట నష్టాలను, గిట్టుబాటు ధర లేకపోవడం, చివరికి వర్షం రావడంతో తన పొలం పచ్చగా మారడం వంటి అంశాలతో ఎమోషనల్‌గా నటించారు. డాన్సులు, కామెడీ స్కిట్లు నవ్వులు పూయించారు. ఇందులో బిగ్‌ బాస్‌7 కంటెస్టెంట్లతోపాటు సీనియల్స్ ఆర్టిస్టులంతా పాల్గొని సందడి చేశారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories