గుంటూరు కారం, హనుమాన్‌, నా సామి రంగ, సైంధవ్‌.. సంక్రాంతి సినిమాల రన్‌ టైమ్‌.. ఏది తక్కువ అంటే..?

Published : Jan 10, 2024, 08:05 PM IST

సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. రేపటి నుంచి ఆడియెన్స్ కి బ్యాక్‌ టూ బ్యాక్‌ సందడిని పంచబోతున్నాయి. మరి ఈ నాలుగు సినిమాల రన్‌ టైమ్‌ ఎంత, ఏది పెద్దది, ఏది చిన్నది అనేదానిపై ఓ లుక్కేద్దాం.   

PREV
15
గుంటూరు కారం, హనుమాన్‌, నా సామి రంగ, సైంధవ్‌.. సంక్రాంతి సినిమాల రన్‌ టైమ్‌.. ఏది తక్కువ అంటే..?

మహేష్‌బాబు హీరోగా నటించిన `గుంటూరు కారం` సినిమా సంక్రాంతి సినిమాల్లో ఎక్కువ నిడివి ఉన్న మూవీగా నిలుస్తుంది. దీని నిడివి రెండు గంటల 39 నిమిషాలు. ఇటీవల చాలా సినిమాల్లో నిడివి పెద్దగా ఉన్న నేపథ్యంలో ఇది తక్కువే అని చెప్పొచ్చు. మహేష్‌ లాంటి సినిమాకి ఆ మాత్రం ఓకే అని చెప్పొచ్చు. ఇది జనవరి 12న విడుదల కాబోతుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో ఇది టాప్ లో ఉంది. 

25

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌ వర్మ రూపొందించిన `హనుమాన్‌` సినిమా కూడా శుక్రవారమే(జనవరి 12న) విడుదల కానుంది. ఈ మూవీ నిడివి `గుంటూరు కారం` కంటే ఒక్క నిమిషం తక్కువ. రెండు గంటల 38 నిమిషాలు ఉంది. హనుమంతుడికి, ప్రస్తుత పరిస్థితులను జోడించి రూపొందించిన ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. 

35

దీంతోపాటు వెంకటేష్‌ కూడా సంక్రాంతి బరిలో ఉన్నారు. ఆయన నటించిన `సైంధవ్‌` సినిమా జనవరి 13న రానుంది. శైలేష్‌ కొలను దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ రానుంది. కూతురు సెంటిమెంట్‌తో రాబోతుంది. శ్రద్దా శ్రీనాథ్‌ హీరోయిన్‌. రుహానీ శర్మ, ఆండ్రియా, ఆర్య కీలక పాత్రల్లో మెరవబోతున్నారు. ఈ మూవీ నిడివి రెండు గంటల 20 నిమిషాలే. ఇటీవల వస్తోన్న సినిమాల్లో చాలా తక్కువే అని చెప్పొచ్పు. 

45

ఇక సంక్రాంతి బరిలో నాగార్జున కూడా ఉన్నారు. ఆయన అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌లతో కలిసి `నా సామి రంగ` చిత్రంలో నటించారు. విజయ్‌ బిన్ని దర్శకుడు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. సంక్రాంతి పండగలాంటి సినిమా అని చెప్పొచ్చు. ఈ మూవీ నిడివి రెండు గంటల 15 నిమిషాలు మాత్రమే. సంక్రాంతికి వస్తోన్న చిత్రాల్లో ఇదే తక్కువ నిడివి ఉన్న మూవీ కావడం విశేషం. జనవరి 14న ఈ మూవీ విడుదల కానుంది. 

55

సంక్రాంతికి నాలుగు సినిమాలున్నా `గుంటూరు కారం`కి మంచి బజ్‌ ఉంది. టీజర్‌, పాటలు, ట్రైలర్‌ ఆకట్టుకున్నాయి. పర్‌ఫెక్ట్ సంక్రాంతి పండగ సినిమాలా ఉంది. ఫ్యామిలీ ఎలిమెంట్లు హైలైట్‌గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత `హనుమాన్‌` బజ్ ఉంది. వెంకీ `సైంధవ్‌`కి ఏమాత్రం బజ్‌ లేదు. యాక్షన్‌ మూవీ కావడంతో సంక్రాంతి ఫ్లేవర్‌ ఇందులో మిస్సింగ్‌, ఇక నాగ్‌ సినిమాలో సంక్రాంతి స్టఫ్‌ ఉన్నా, ఆ రేంజ్‌లో బజ్‌ రావడం లేదు. దీంతో వార్‌ వన్‌ సైడ్‌ అనేలా పరిస్థితులున్నాయి. మరి ఈ సంక్రాంతి విన్నర్‌ ఎవరో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories