బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల గ్రాండ్ గా ముగిసింది. ఈ సీజన్ కి ఎప్పుడూ లేనంత క్రేజ్ ఏర్పడింది. శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శోభా శెట్టి లాంటి వాళ్ళు ఊహించని విధంగా క్రేజీ సెలెబ్రిటీలు అయిపోయారు. శివాజీ ఆల్రెడీ పాపులర్ ఐయినప్పటికీ బిగ్ బాస్ తర్వాత అతడి క్రేజ్ రెట్టింపు అయింది అని చెప్పొచ్చు. పల్లవి ప్రశాంత్ చుట్టూ వివాదాలు నెలకొనడం, అతడు అరెస్ట్ అయి బెయిల్ పై విడుదల కావడం చకచకా జరిగిపోయాయి.