నల్లగా, దరిద్రంగా ఉన్నా పర్లేదు, అది ఉంటే చాలు పెళ్లి చేసుకుంటా... నిస్సిగ్గుగా చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటీ!

Published : Jan 10, 2024, 10:06 AM ISTUpdated : Jan 10, 2024, 10:56 AM IST

బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ భర్త విషయంలో ఓపెన్ కామెంట్స్ చేసింది. అందవిహీనుడైనా పర్లేదు ఆ ఒక్కటి ఉంటే చాలు పెళ్ళికి రెడీ అని మనసులో కోరిక బయటపెట్టింది.    

PREV
17
నల్లగా, దరిద్రంగా ఉన్నా పర్లేదు, అది  ఉంటే చాలు పెళ్లి చేసుకుంటా... నిస్సిగ్గుగా చెప్పేసిన బిగ్ బాస్ బ్యూటీ!
Bigg Boss Ashwini Sree


నటి అశ్విని శ్రీ బిగ్ బాస్ షోతో పాప్యులర్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు 7లో అశ్విని శ్రీ పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసింది. ఐదు వారాల అనంతరం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి అర్జున్, అశ్విని శ్రీ, భోలే, నయని పావని, పూజ మూర్తిలను హౌస్లోకి పంపారు. 


 

27
Bigg Boss Ashwini Sree

అశ్విని శ్రీ కొంత మేరకు రాణించారు. మాటలో స్పష్టత లేకపోవడం, గట్టిగా మాట్లాడకపోవడం ఆమెకు మైనస్. అయితే తన గ్లామర్ తో ఆకట్టుకుంది. సీరియల్ బ్యాచ్ అయిన ప్రియాంక, శోభ శెట్టి లతో ఆమెకు పడేది కాదు. నాతో ఎవరూ కలవడం లేదని అశ్విని శ్రీ ఆవేదన చెందారు. 

37
Bigg Boss Ashwini Sree

అశ్వినిశ్రీ కంటెస్టెంట్ భోలే షావలితో స్నేహం చేసింది. ఎక్కువగా అతనితో ఉండేదుకు ఇష్టపడేది. భోలే షావలి 10వ వారం ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత ఆమె యావర్, పల్లవి ప్రశాంత్ లతో స్నేహం చేసింది. కాగా అశ్విని శ్రీ 11వ వారం సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. 

47
Bigg Boss Ashwini Sree

12వ వారం డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా... ఎవరినీ నామినేట్ చేయకుండా సెల్ఫ్ నామినేట్ అయ్యింది. అది ఆమెకు మైనస్ అని చెప్పాలి. రతిక రోజ్, అశ్వినిశ్రీ 12వ వారం ఎలిమినేట్ అయ్యారు. గతంతో పోల్చితే అశ్వినిశ్రీ కి పాపులారిటీ దక్కింది. ఆమె నటించిన సినిమాల గురించి చర్చ జరుగుతుంది. 

 

57
Bigg Boss Ashwini Sree

ఇక వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న అశ్విని శ్రీ పలు విషయాలపై స్పందిస్తున్నారు. తాజాగా ఆమె కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు వెల్లడించారు. అశ్విని శ్రీ మాట్లాడుతూ... నేను ప్రస్తుతం సింగిల్. మనసుకు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. నా చుట్టూ చాలా మంది ఉన్నా కూడా ప్రేమ భావన కలిగించలేకపోయారు. 

67
Bigg Boss Ashwini Sree

నాకు  కాబోయేవాడికి ఆస్తి పాస్తులు లేకపోయినా పర్లేదు, నేను చూసుకుంటాను. నల్లగా, దరిద్రంగా, అందవిహీనంగా ఉన్నా పర్లేదు. ఒక్క క్వాలిటీ ఉంటే చాలు పెళ్లి చేసుకుంటాను. అతనికి మంచి మనసు ఉండాలి. నన్ను అర్థం చేసుకునేవాడై ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నవాడు ఎదురైతే వెంటనే పెళ్లి చేసుకుంటాను... అని అశ్వినిశ్రీ చెప్పుకొచ్చింది. 

 

77
Bigg Boss Ashwini Sree

అశ్వినిశ్రీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఆ క్వాలిటీ ఉన్నవాడు అశ్వినిశ్రీ కి ఎప్పుడు తారసపడతాడో చూడాలి. కాగా అశ్విని శ్రీ కి పలు చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. 
 

Read more Photos on
click me!

Recommended Stories