Guppedantha Manasu 10th January Episode:శైలేంద్ర నిజ స్వరూపం రికార్డు చేసిన ధరణి, చితకబాదిన పెద్దయ్య..!

Published : Jan 10, 2024, 08:26 AM IST

శైలేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత.. ధరని.. వీడియో ఆపేస్తుంది. ఈ వీడియో చూపించి మీతో ఓ ఆట ఆడుకుంటాను అని ధరని ఫిక్స్ అవుతుంది.  

PREV
16
Guppedantha Manasu 10th January Episode:శైలేంద్ర నిజ స్వరూపం రికార్డు చేసిన ధరణి,  చితకబాదిన పెద్దయ్య..!
Guppedantha Manasu

Guppedantha Manasu 10th January Episode: రిషి గురించి తెలుసుకోవడానికి ధరణి.. మహేంద్ర ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.  అయితే, అనుమానంతో శైలేంద్ర కూడా ధరణిని ఫాలో అవుతాడు. సరిగ్గా ధరణి మహేంద్రకు ఫోన్ చేద్దాం అనుకునేలోపు... శైలేంద్ర కనపడటంతో వచ్చి కారు ఎక్కుతుంది. నేటి ఎపిసోడ్ లో కారుతో శైలేంద్ర.. ధరనిని ఇంటికి తీసుకువస్తాడు. కారులో నుంచి బలవంతంగా ధరణిని ఇంట్లోకి లాక్కొచ్చొ పడేస్తాడు.

ధరణి వదలని అడిగినా వినకుండా లాక్కొస్తాడు. ‘నేనే వస్తున్నాను కదా.. ఎందుకు లాక్కొస్తున్నారు..? అలిగి పుట్టింటికి వెళ్లిన పెళ్లాన్ని లాక్కొచ్చినట్లు లాక్కొస్తున్నారు.’ అని ధరణి అంటుంది. ‘ అతిగ ప్రసంగం చేయకు, అసలు నువ్వు బాబాయ్ ఇంటికి ఎందుకు వెళ్లావ్? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నావ్..?’ అని అడుగుతాడు. దీంతో.. ధరణి ఏ మాత్రం బయపడకుండా రిషి దగ్గరకు అని సమాధానం చెబుతుంది. అది విని శైలేంద్ర షాకౌతాడు. అంటే.. రిషి వచ్చేశాడా..? రిషి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. అయితే ధరణి మాత్రం కూల్ గా.. తనకు తెలీదని.. రిషి యోగ క్షేమాలు తెలుసుకోవాలని తన మనసుకు అనిపించిందని.. అందుకే వెళ్లాను అని చెబుతుంది. నిజంగా నిజం అదేనా అని అడుగుతాడు. అదే నిజం అని చెబుతుంది. దీంతో.. శైలేంద్ర సోఫాలో కూర్చొని రగిలిపోతూ ఉంటాడు. ఇదే ఛాన్స్ అనుకున్న ధరణి.. నెమ్మదిగా.. వారు మాట్లాడుకునే మాటలను రికార్డు చేయాలని అనుకుంటుంది. శైలేంద్ర చూడకుండా.. కెమేరా ఆన్ చేసి వీడియో రికార్డు చేయడం మొదలుపెడుతుంది.

26
Guppedantha Manasu

ఇక వీడియో రికార్డు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ధరణి రెచ్చిపోతుంది.. ‘మీరు చేసిన దారుణాలన్నీ నాకు తెలుసు.  మీరు అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి రిషిపై ఎన్ని కుట్రలు చేశారు. మీరు ఎండీ సీటు దక్కించుకోవాలని చాలా దారుణాలు చేశారు. ఎండీ సీటు దక్కించుకోవడం కాదండి.. దాని కోసం అర్హత కూడా ఉండాలి.’ ఇలా చాలా మాటలు అంటుంది. ఆ మాటలకు కోపం వచ్చి  శైలేంద్ర కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు. ఇంతలో ధరణి మామయ్య అని పిలుస్తుంది. శైలేంద్ర వెంటనే మారిపోయి.. మామూలు అయిపోతాడు. వెంటనే ధరణి.. ఇది మీ అసల నిజ స్వరూపం అని, మామయ్య ముందు నాతో ప్రేమగా నటిస్తున్నారని నాకు తెలుసు అని అంటుంది. కానీ మామయ్య ఇప్పుడు ఇంట్లో లేరు అని చెబుతుంది. చిరాకుగా.. శైలేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత.. ధరని.. వీడియో ఆపేస్తుంది. ఈ వీడియో చూపించి మీతో ఓ ఆట ఆడుకుంటాను అని ధరని ఫిక్స్ అవుతుంది.

36
Guppedantha Manasu

ఇక.. రాత్రి సమయంలో రిషి, వసులు కారులో కూర్చొని ఉంటారు. ఇలా చాలాకాలం తర్వాత కారులో కూర్చున్నామని ఇద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత.. వసు రిషిని తనకు సీటు బెల్టు పెట్టమని అడుగుతుంది.  రిషి ప్రయత్నిస్తాడు కానీ.. తన శరీరం సహకరించదు. దీంతో.. వసు.. మీరు ప్రయత్నించారు అది చాలు నాకు అంటుంది. ఈ లోగా.. కొన్ని ఉత్తరాలు కింద పడతాయి. అవి.. అప్పుడెప్పుడో వాళ్లకు పాండ్యన్ తెచ్చి ఇస్తాడు. అవి.. జగతి రాసిన ఉత్తరాలు. వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. ఇప్పుడు చదువుతారా అని వసు అడుగుతుంది. ఓపిక లేదు అని మళ్లీ ఆ ఉత్తరాలను రిషి పక్కన పెట్టేస్తాడు. నిజానికి ఆ ఉత్తరాలు చదివితే.. రిషికి తన శత్రువు ఎవరు అనే విషయం తెలిసిపోతుంది. కానీ.. దానిని వాళ్లు చదవకుండా పక్కన పెడుతూ వస్తున్నారు.

46
Guppedantha Manasu

మరుసటి రోజు.. శైలేంద్ర ఓ రౌడీని.. వసుని కిడ్నాప్ చేసిన ప్రదేశానికి తీసుకువెళతాడు. అక్కడ రిషిని చూశారా అని శైలేంద్ర ఆ రౌడీని అడుగుతాడు. అయితే రిషిని చూడలేదని, వసుధార మాత్రం ముసలివాడితో మాట్లాడిందని చెబుతాడు. తర్వాత.. ఆ ఇంటిని కూడా చూపిస్తాడు. రౌడీని పంపించి.. శైలేంద్ర.. ఆ ఇంటి దగ్గరకు వస్తాడు. లోపల ముసలివాళ్లు ఇద్దరూ.. ఆయుర్వేదం మూలికలతో పసరు నూరుతూ ఉంటారు. ‘ రిషి ఇక్కడే ఉంటే.. వాడిని చంపేసి.. ఈ రోజు నీకు తులసి తీర్థం పోస్తాను రా’ అని శైలేంద్ర అనుకుంటాడు. తర్వాత లోపలికి వెళతాడు.

56
Guppedantha Manasu

ఆ ముసలివాళ్లు.. ఎవరు బిడ్డా నువ్వు అని అడుగుతారు. బాటసారిని అని చెప్పిన శైలేంద్ర..  మీరు ఇక్కడ ఏం చేస్తారు అని అడుగుతాడు. అయితే.. వాళ్లు.. ఆయుర్వేద వైద్యం చేస్తూ ఉంటాం అని చెబుతారు. అతని తీరుపై వాళ్లకు అనుమానం కలుగుతుంది. మీకు ఏం కావాలి అంటే.. ఆయుర్వేదం చేయించుకుందామని వచ్చాను అంటాడు. అయితే, సమస్య ఏంటి అని అడుగుతారు. శైలేంద్ర..తనకు వచ్చిన జబ్బు ఏంటో చెప్పకుండా చాలా సేపు తటపటాయిస్తాడు. తర్వాత నడుము నొప్పి  అని చెబుతాడు. అయితే.. ఇప్పటి వరకు బాగానే నడిచావ్ కదా.. అని వాళ్లు అడిగితే.. అప్పుడప్పుడు పట్టేస్తూ ఉంటుంది అని చెబుతాడు.

66
Guppedantha Manasu

ఇంత చిన్నవయసులో నడుము నొప్పి ఏంటి అని వాళ్లు అడిగితే..  లేవలేకపోతున్నాను అని.. పట్టేస్తోంది అని ఏదేదో చెబుతాడు. వాళ్లు సరే అని ట్రీట్మెంట్ మొదలుపెడతాడు. నొప్పి తట్టుకోలేక శైలేంద్ర అరుస్తూ ఉంటాడు. తర్వాత కషాయం తాగించాలని చూస్తారు. అయితే.. కషాయం తాగడానికి శైలేంద్ర ఇబ్బంది పడతాడు. కానీ.. వాళ్లు మాత్రం.. కషాయం తాగాల్సిందే అని  బలవంతంగా తాగిస్తారు. కానీ.. శైలేంద్ర అది తాగలేక.. ఇబ్బంది పడతాడు. అది..కషాయం కాదని.. కాకరకాయ రసం అని గుర్తుపడతాడు. మర్చిపోయి.. వేరేది ఇచ్చాను అని పెద్దమ్మ అంటుంది. మళ్లీ.. ఈసారి కషాయం తెస్తుంది.  ఈ సారి కూడా తాగలేక ఇబ్బంది పడతాడు. అది కూడా అలానే చేదుగా ఉందని శైలేంద్ర అంటాడు. నేను తాగను అంటాడు. కానీ.. పెద్దయ్య ఒప్పుకోడు. బలవంతంగా తాగించేస్తాడు.  అది తాగి.. శైలేంద్ర తెగ ఇబ్బంది పడిపోతాడు. ఆ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది.

ఆ తర్వాత.. శైలేంద్ర మిమ్మల్ని ఓ మాట అడగాలి అంటే.. వైద్యం పూర్తయ్యాకే అడగాలి అంటాడు. బలవంతంగా పడుకోపెడతాడు. లేని రోగానికి వైద్యం ఏంటి అని శైలేంద్ర కంగారుపడతాడు. వాల్లు మాత్రం వదలకుండా.. పెద్ద కర్ర తీసుకొని  శైలేంద్ర నడుము మీద కొట్టాలని చూస్తాడు. అది చూసి శైలేంద్ర దడుసుకుంటాడు. ఇదేంటి అంటే.. దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అని చూపిస్తాడు.  అంతే.. శైలేంద్రకు వణుకు వచ్చేస్తుంది. తనకు వద్దు అని అంటాడు. అయినా వాళ్లు వినకుండా నడుము మీద దంచి కొట్టేస్తారు.

click me!

Recommended Stories