స్కూల్ పుస్తకాల్లో తమన్నా పైనా, ఆ హీరోపైనా పాఠం, మండిపడుతున్న తల్లితండ్రులు

First Published Jun 29, 2024, 6:36 AM IST

‘బాహుబలి’ వంటి సినిమాల్లో వీర నారిగానూ పాత్ర చేసి ఈ బ్యూటీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించింది. 

తెలుగులో ఓ వెలుగు వెలిగిన తమన్నా ఈ మధ్యకాలంలో వెనకబడింది. పెద్ద హీరోల సినిమాల్లో ఆఫర్స్ రావటం లేదు. అయితే వెబ్ సీరిస్ లు చేస్తూ తనను తాను బిజీ చేసుకుంటోంది. అలాగే కేవలం హీరోయిన్ పాత్ర మాత్రమే కాకుండా తన దగ్గరకు వచ్చిన ఎలాంటి పాత్ర అయినా చేయటానికి సిద్దపడుతోంది. అయితే అదే సమయంలో ఆమెపై వివాదాలు చుట్టుముడుతున్నాయి.  ఇప్పుడు మరో సారి ఓ కొత్త చిత్రమైన వివాదంలో ఇరుక్కుంది.

ఇరవై ఏళ్ల క్రితం హిందీ చిత్రం ‘ఛాంద్ సా రోషాన్ చహ్ర’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచమైన నటి తమన్నా భాటియా (Tamannaah Bhatia). కేవలం 15 ఏళ్ల వయస్సులో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ప్రస్తుతం కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోంది. హిందీలో చేసిన మొదటి సినిమా ప్లాప్‌గా నిలచింది.
 

అయితే  2005లోనే మంచు మనోజ్ హీరోగా చేసిన ‘శ్రీ’ చిత్రంతో తెలుగు పరిశ్రమకి పరిచయమైంది. 2006లో ‘కేడీ’ సినిమాతో తమిళ ప్రేక్షకులని కూడా పలకరించింది. ఈ రెండు చిత్రాలు కూడా ప్లాప్‌గానే మిగిలాయి. కానీ.. 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన ‘హ్యాపీడేస్’ చిత్రంతో మొదటి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి తమన్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇటు తెలుగు సినిమాలు.. అటు తమిళ సినిమాలు.. అడదపాదడపా హిందీ చిత్రాలు చేస్తూ కెరీర్‌ని విజయవంతంగా సాగిస్తోంది.
 

తమన్నా ఓ వైపు చిరంజీవి, వెంకటేశ్ వంటి సీనియర్ హీరోలతో నటిస్తూనే.. మరో వైపు సందీప్ కీషన్, సత్యదేవ్ వంటి కుర్ర హీరోలతో జతకడుతూ దూసుకుపోయింది. ఓ వైపు లవ్‌స్టోరీలు చేస్తూనే.. మరో వైపు ‘బాహుబలి’ వంటి సినిమాల్లో వీర నారిగానూ పాత్ర చేసి ఈ బ్యూటీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించింది. ప్రభాస్, ఎన్‌టీఆర్, రామ్‌చరణ్, రవితేజ వంటి స్టార్లకి జోడీగా నటించి మంచి విజయాలను అందుకుంది.
 

ఇటీవ‌ల   ఓవర్ ఎక్సపోజింగ్ తో  వార్త‌ల్లోకెక్కి బాగా ట్రోలింగ్‌కు గుర‌వుతున్న తమన్నా  ఈ సారి త‌న ప్ర‌మేయం లేకుండానే ఈ మారు దేశ వ్యాప్తంగా ఓ తీవ్ర వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఓ పాఠ‌శాల పుస్త‌కంలో త‌మ‌న్నా మీద ప్ర‌త్యేక‌ పాఠ్యాంశం ఉండ‌డ‌మే. సినీ నటి తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేయడంపై బెంగళూరులో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.

 క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగ‌ళూరు (Bengaluru) స‌మీపంలోని హెబ్బ‌ల్ (Hebbal)లోని సింధీ హైస్కూల్  లో 7వ త‌ర‌గ‌తి పాఠ్యాంశాల్లో సినిమా న‌టి త‌మ‌న్నా భాటియా (Tamannaah Bhatia) జీవిత విశేషాల‌తో ఓ ప్ర‌త్యేక పాఠాన్ని పొందు పరిచారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న స‌ద‌రు విద్యార్థుల త‌ల్లిదండ్రులు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ స్థానిక బాల‌ల హ‌క్కుల ర‌క్ష‌ణ సంఘంలో ఫిర్యాదు చేశారు. 

పాఠశాలలోని ఏడో తరగతి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఏడో చాప్టర్‌లో సింధీ వ్యక్తుల గురించి అంశాన్ని పొందుపరిచారు. ఇందులో నటి తమన్నా భాటియా, నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ గురించి పాఠ్యాంశంగా చేర్చారు. పలు చిత్రాల్లో అర్ధ నగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని తల్లిదండ్రు లు మండిపడ్డారు. 
 

సింధీ సామాజికవర్గంలో ఎంతో మంది కళాకారులున్నారని, వారి గురించి పాఠ్యాంశంగా ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు తమ పిల్లలకు టీసీ ఇస్తామని పాఠశాల యాజమాన్యం బెదిరిస్తున్నట్లు తెలిపారు. 

దీంతో ఇప్పుడు ఈ వార్త దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ విష‌య‌మై విద్యార్థుల‌ త‌ల్లిదండ్రులు మాట్లాడుతూ.. త‌మ‌న్నా పాఠ్యాంశం విష‌యంలో పాఠ‌శాల యాజ‌మాన్యాన్ని క‌లిసి మాట్లాడామ‌ని వారు స‌హేతుక‌మైన జ‌వాబు ఇవ్వ‌డం లేద‌ని అన్నారు.
 

వివాదం పెరిగాక తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం బుజ్జగిస్తోంది. అదొక పాఠ్యేతర అంశంగా చేర్చినట్లు, అందులో తమన్నా పాఠాలను ఇచ్చినట్లు తెలిపింది. స్వాతంత్య్రం అనంతరం సింధూ ప్రాంత విభజన అనంతరం ఆ సామాజిక వర్గ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయం విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠ్యాంశంగా ముద్రించినట్లు తెలిపింది. సింధీ సామాజికవర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చినట్లు తెలిపింది. 
 

స్వాతంత్య్రానికి పూర్వం, ఇప్పుడు సింధు ప్రాంతంలో జీవ‌న స్థితిగ‌తుల‌ను, వారు రెండు వ‌ర్గాలుగా విడిపోయాక వారి లైఫ్ స్టైల్స్ ప్ర‌స్తుతం ఎలా ఉన్నారో, సింధూ ప్ర‌జ‌లు మ‌న దేశంలో ఎలా మ‌మేక‌మ‌య్యారో తెలిపేందుకే ఆ ప‌ని చేశామంటూ స‌ద‌రు పాఠ‌శాల యాజ‌మాన్యం స‌మ‌ర్థించుకుంటుంద‌ని పేరెంట్స్ తెలిపారు. సింధు వ‌ర్గానికి చెందిన త‌మ‌న్నా (Tamannaah Bhatia), ర‌ణ్ వీర్ సింగ్ (Ranveer Singh) త‌మ రంగాల్లో అంచెలంచెలుగా ఎదిగి ప్ర‌స్తుతం దేశంలో ఉన్న‌త స్థానాల్లో పేరు సంపాదించినందున‌ వ‌ళ్ల వారు ఎదిగిన క్ర‌మాన్ని, జీవితంలోని ముఖ్యాంశాల‌ను ఆ లెస‌న్‌లో పెట్ట‌డం జ‌రిగిందంటూ విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు న‌చ్చ చెబుతెన్న‌ట్లు నెట్టింట వార్త‌లు షికారు చేస్తున్నాయి.

Actress Tamannaah Bhatia

 కర్ణాటకలోని అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ (KAMS) త‌ల్లిదంగ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తోంది. ఈక్ర‌మంలో పాఠశాల మరియు CBSE బోర్డు రెండింటినీ సంప్రదించింది కానీ సంబంధిత పాఠశాల అధికారులు ఈ సమస్యపై మ‌ట్లాడ‌డానికి నిరాకరించడం గ‌మ‌నార్హం.

Latest Videos

click me!