`తీశావ్‌ లే బోడీ సినిమా`.. `బాహుబలి` తీసిన రాజమౌళిపై కీరవాణి భార్య ఫైర్‌.. నాని ముందే అంత మాట అనేసిందా?

Published : Jun 28, 2024, 09:08 PM IST

రాజమౌళి `బాహుబలి` సినిమాతో ఇండియన్‌ సినిమా లెక్కలు మార్చేశాడు. స్కేల్‌ పరంగా, కలెక్షన్ల పరంగానూ ఆయన కొత్త పుంతలు తొక్కించారు. అలాంటి డైరెక్టర్‌పై కీరవాణి భార్య ఫైర్‌ కావడం షాకిస్తుంది.  

PREV
17
`తీశావ్‌ లే బోడీ సినిమా`.. `బాహుబలి` తీసిన రాజమౌళిపై కీరవాణి భార్య ఫైర్‌.. నాని ముందే అంత మాట అనేసిందా?

రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు. ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచేసిన దర్శకుడు. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీయోచ్చు, కలెక్షన్లని రాబట్టవచ్చు అనేది చేసి నిరూపించారు. ఇండియన్‌ సినిమాకి కలెక్షన్ల టెస్ట్ ని పరిచయం చేశారు. `మగధీర`, `ఈగ`, `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రాలతో తనని తాను బెస్ట్ డైరెక్టర్‌గా మలుచుకుంటూ వచ్చాడు.   

27

`బాహుబలి2` సినిమా ప్రస్తుతం ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. ఇది ఏకంగా 1800కోట్ల కలెక్షన్లని వసూలు చేసింది. ఈ సినిమా వచ్చి ఏడేళ్లు అవుతుంది. దీన్ని కొట్టే మూవీ ఇంకా రాలేదు. `కల్కి2898ఏడీ` దాన్ని బీట్‌ చేస్తుందని అన్నారు కానీ అది సాధ్యం కాదు. రాజమౌళి మాత్రం తన రికార్డులను తాను బ్రేక్‌ చేసుకోగలడని అర్థమవుతుంది. 
 

37

`బాహుబలి 2` లాంటి ఇండియన్‌ సినిమా, తెలుగు సినిమా గర్వపడే మూవీని చేసిన దర్శకుడైన రాజమౌళిని ఆయన వదిన వల్లీ(కీరవాణి భార్య శ్రీవల్లి) చులకనగా తీసిపడేయడం షాకిస్తుంది. దేశం మొత్తం రాజమౌళి గురించి మాట్లాడుకుంటుంటే ఆమె మాత్రం తీశావ్‌ లే బోడి సినిమా అని ఫైర్‌ కావడం ఆశ్చర్యపరుస్తుంది. అది కూడా నేచురల్‌ స్టార్‌ నాని ముందు కావడం గమనార్హం. మరి ఆమె అలా ఎందుకు అన్నది, నాని అక్కడ ఎందుకున్నాడు? అసలేం జరిగిందనేది చూస్తే.. 
 

47
బాహుబలి 2 - $2,450k

రాజమౌళి తీసిన `బాహుబలి 2` సినిమా విడుదలైంది. విశేష ఆదరణ పొందుతుంది. ఆ సమయంలో రాజమౌళి తన ఫ్యామిలీతో థియేటర్‌ విజిట్‌ చేస్తున్నారు. ఆ సమయంలో భళ్లారిలోని తన ఇంట్లో ఉన్నారు. లంచ్‌ చేసేందుకు కూర్చున్నారు. ఆ సమయంలో హీరో నాని రాజమౌళి ఇంటికి వెళ్లాడు. అంతా లంచ్‌ టేబుల్‌పై ఉండటంతో నాని కూడా లంచ్‌ చేసేందుకు పిలిచారు. నాని వెళ్లి కూర్చున్నాడు. 

57

రాజమౌళి ఉండి, మళ్లీ పక్కన ఉన్న మళ్లీ వెళ్దామా సినిమాకి? అని కాజ్వల్‌గా తన ఫ్యామిలీ మెంబర్స్ తో అన్నాడు. రాజమౌళి ఫ్యామిలీ ఉమ్మడి ఫ్యామిలీ కీరవాణి, బ్రదర్స్ ఇలా అందరు కలిసే ఉంటారు. ఆ సమయంలో రాజమౌళి అలా అనడంతో మండిపోయిన వల్లీ `తీశావ్‌ లే బోడీ సినిమా. దాన్ని మళ్లీ చూస్తామా` అన్నదట. పక్కనే ఉన్న naniకి ఫ్యూజులు ఎగిరిపోయాయి.

67

అదేంటి అంత మాట అనేందని మనసులో అనుకుందట. ఇలాంటి మనుషులు ఫ్యామిలీలో ఉంటే ఎంత సాధించినా డౌన్‌ టూ ఎర్త్ ఉండొచ్చు అనికామెంట్‌ చేశాడు రాజమౌళి. సింహ హీరోగా నటించిన ఓ సినిమా ఈవెంట్‌కి గెస్ట్ గా వెళ్ళిన నాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.  
 

77
Mahesh Babu and Rajamouli

ప్రస్తుతం రాజమౌళి.. మహేష్‌ బాబు హీరోగా సినిమా చేయబోతున్నారు. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ లాక్‌ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందని, కాస్టింగ్‌ ఎంపికపై కూడా కసరత్తులు జరుగుతున్నాయట. ఈ మూవీని ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు రాజమౌళి. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచరస్‌గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories