రష్మికి అరుదైన వ్యాధి.. స్టెరాయిడ్‌ కూడా తీసుకున్న జబర్దస్త్ యాంకర్‌.. అందుకే దానికి దూరంగా ఉంటుందా?

First Published Jun 28, 2024, 11:13 PM IST

యాంకర్‌ రష్మి అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఆమె దానికోసం ఏకంగా స్టెరాయిడ్స్ కూడా తీసుకుందా? ఓ షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. 
 

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌.. బుల్లితెరని ఊపేస్తున్న యాంకర్‌. టీవీలో అత్యంత పాపులర్‌ షో అయిన జబర్దస్త్ కి ఆమె యాంకర్‌ కావడంతో ఆమె జోరు, క్రేజ్‌ మామూలుగా ఉండదు. బుల్లితెర, సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. ప్రస్తుతం రష్మి గౌతమ్‌.. `జబర్దస్త్` రెండు ఎపిసోడ్లు, `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తుంది. ఓ రకంగా ఆమె మూడు షోస్‌ చేస్తుందని చెప్పొచ్చు. 
 

ఇక మూడు పదులు దాటి నాలుగు పదుల వయసుకి దగ్గర అవుతుంది రష్మి గౌతమ్‌. కానీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవడం లేదు. ఆ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. లవ్‌లో, రిలేషన్స్ లో ఉందా అంటే ఆ తరహా హింట్‌ కూడా లేదు. కాకపోతే జబర్దస్త్ మాజీ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్ చేస్తుందని, ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇందులో నిజమెంతా అనేది మాత్రం తెలియదు. 
 

Rashmi Gautam

ఇదిలా ఉంటే.. టీవీ షోస్‌లో మాత్రం రష్మి గౌతమ్‌ చాలా జోష్‌తో, యాక్టివ్‌గా, సరదాగా ఉంటుంది. పాజిటివ్‌గా ఉంటుంది. ఎవరైనా విమర్శలు చేసినా, సెటైర్లు వేసినా, పంచ్‌లు వేసినా పాజిటివ్‌గా తీసుకుంటుంది. పాజిటివ్‌ రియాక్షన్స్ ఇస్తూ అలరించే ప్రయత్నం చేస్తుంది. అందంతోనూ మంత్రముగ్దుల్ని చేస్తుందీ భామ. సోషల్‌ మీడియాలో యానిమల్స్, పెట్స్, డాగ్స్ విషయంలోనూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది, తప్ప ఎప్పుడూ నెగటివ్‌ సైడ్‌ వెళ్లదు, వాటిని పట్టించుకోదు. 
 

అయితే రష్మి ఇలా ఉండటానికి ఓ బలమైన కారణం ఉందట. ఆమెకి ఓ అనారోగ్య సమస్య ఉందట. ఓ అరుదైన వ్యాధితో రష్మి బాధపడుతుందట. ఆమె `రూమటాయిడ్‌ సమస్య`తో బాధపడుతుందట. ఇదోక ఆటో ఇమ్యూన్‌ సమస్య. దీని కారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం. దీనికారణంగా రష్మి బరువు పెరగడం, తగ్గడం చేస్తుందట. దీనిపై ఓ నెటిజన్ రష్మిని ప్రశ్నించారు. తన భర్త కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నాడు, దానికి చికిత్స ఏంటని అడిగింది. దీనికి రష్మి రియాక్ట్ అవుతూ సలహాలిచ్చింది. 
 

ఈ సమస్యకి చికిత్స లేదని, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఫలితం ఉంటుందని చెప్పింది. ఆయుర్వేద మందులు వాడాలని తెలిపింది. తాను ఇటీవల ఆటో ఇమ్యూన్‌ సమస్య కారణంగా స్టెరాయిడ్స్ తీసుకున్నాను. 12ఏళ్ల వయసులో ఈ వ్యాధి తీవ్రతని తగ్గించేందుకు తీవ్రంగా నొప్పి ఉండే ఇంజిక్షన్లు తీసుకున్నట్టు తెలిపింది. రష్మి వాళ్ల అమ్మ కొన్ని చిట్కాలు చెప్పిందట. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చానని తెలిపింది రష్మి. ఒత్తిడి తగ్గించుకోవాలని, నెగటివిటీకి దూరంగా ఉండాలని, పాజిటివ్‌ మైండ్‌తో ఉండాలని చెప్పింది. నెగటివ్‌ ఉండేవాళ్లకి, వెనక్కి నెట్టేవాళ్లకి దూరంగా ఉండాలని చెప్పింది రష్మి. 

Rashmi Gautam

సో రష్మి పాజిటివ్‌గా ఉండటానికి కారణం ఇదే అని తెలుస్తుంది. అయితే ఇది ఆరేళ్ల క్రితం నాటి విషయం. అప్పట్లో సోషల్‌ మీడియా ఛాట్‌లో రష్మి ఈ విషయాలు చెప్పగా, సినీజోష్‌ కథనాన్ని రాసింది. అయితే రష్మి ఇప్పటికీ ఈ సమస్యతో బాధపడుతుందా? దాన్నుంచి కోలుకుందా అనేది క్లారిటీ లేదు. ఆ విషయం తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం తాను చేస్తున్న రెండు షోస్‌తో మాత్రం ఆద్యంతం అలరిస్తుంది రష్మి గౌతమ్‌. 
 

Latest Videos

click me!